శ్రావణమాసం ముందు చుక్కలు చూపిస్తున్న గోల్డ్ రేటు.. గ్రాముకు ఎన్ని వేలు పెరిగిందంటే?

శ్రావణమాసం ముందు చుక్కలు చూపిస్తున్న గోల్డ్ రేటు.. గ్రాముకు ఎన్ని వేలు పెరిగిందంటే?

10 రోజుల కిందటి వరకూ ప్రశాంతంగా స్థిమితంగా ఉన్న బంగారం, వెండి ధరలు గడచిన వారం రోజులుగా ఊహించని ర్యాలీతో దూసుకుపోతున్నాయి. బంగారం విషయానికి వస్తే దాదాపు 10 గ్రాములకు రూ.7వేలకు పైనే పెరిగి శ్రావణమాసం ముందు షాక్ ఇచ్చింది. ఇక వెండి కూడా తగ్గేదే లే అంటూ దూసుకుపోతుండటం సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. శుభకార్యాలకు షాపింగ్ చేయాలనుకుంటున్న ప్రజలు ముందుగా తమ నగరాల్లోని రిటైల్ విక్రయ ధరలను పరిశీలించి ముందుకు వెళ్లటం బెటర్. 

ఆగస్టు 12న బంగారం రేట్లు భారీగా పెరిగాయి. ఆగస్టు 11 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.104 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 486గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 195గా కొనసాగుతోంది. 

ALSO READ : అమెరికాలో అదానీకి ఊరట.. కేసులను కొట్టేసిన US కోర్టు

బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 12, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 60వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.260 దగ్గర అమ్మకాలు జరుగుతున్నాయి.