బ్రిటన్ రాజ్యసభ సభ్యుడికి ఘన స్వాగతం

బ్రిటన్ రాజ్యసభ సభ్యుడికి ఘన స్వాగతం

కోహెడ, వెలుగు: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్​ నాగరాజు బ్రిటన్​ ఎగువ సభ(హౌజ్​ అఫ్​ లార్డ్స్) సభ్యుడిగా గత ఏడాది డిసెంబర్​లో నియమితులయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంగళవారం మొదటిసారి స్వగ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామస్తులు డప్పు వాయిద్యాలు, కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాలువాలు, పూలమాలలతో సన్మానించారు.

రాష్ట్రం నుంచి బ్రిటీష్​ దేశానికి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం అభినందనీయమని పలువురు కొనియాడారు. ఈ ప్రాంతం నుంచి వచ్చే స్టూడెంట్స్, ఉద్యోగులకు అక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. మాజీ జడ్సీటీసీ శ్యామల, సర్పంచ్​ లక్ష్మయ్య, కాంగ్రెస్​ మండల అద్యక్షుడు శెట్టి సుధాకర్, కర్ర రవీందర్​ పాల్గొన్నారు.