సిద్దిపేట, వెలుగు : వానాకాలం పంటలకు సాగు నీటి కొరత తీర్చేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో శనివారం రంగనాయక సాగర్ రిజర్వాయర్ లోకి నీటి పంపింగ్ ను అధికారులు ప్రారంభించారు.
అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి వచ్చిన గోదావరి జలాలను రంగనాయక సాగర్ రిజర్వాయర్ లోకి ఎత్తిపోస్తున్నారు.శనివారం మూడు మోటార్ల తో నీటని రిజర్వాయర్ లోకి విడుదల చేయడంతో అన్నదాతల్లో హర్షాతి రేకాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు కాలువల ద్వారా రైతుల పొలాలతో పాటు నర్మెట పామాయిల్ ఫ్యాక్టరీకి నీటిని సరఫరా చేసే అవకాశం ఉంది.
