ట్రంప్ టవర్స్ లో పెంట్ హౌస్ రూ.62 కోట్లా..! బంగారంతో కడతారా ఏంటి..!

ట్రంప్ టవర్స్ లో పెంట్ హౌస్ రూ.62 కోట్లా..! బంగారంతో కడతారా ఏంటి..!

హైదరాబాద్​లో ‘ట్రంప్​ టవర్స్’ పేరిట సౌత్​ ఇండియాలోనే అతి ఎత్తయిన రెసిడెన్షియల్​  బిల్డింగ్స్  నిర్మించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు చెందిన ట్రంప్​ ఆర్గనైజేషన్, ట్రిబేకా డెవలపర్స్, ఐరా రియాల్టీ  సంస్థలు కలిసి రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట్ గోల్డెన్ మైల్ రోడ్‌‌ లోని సర్వే నంబర్ 109లో ఈ టవర్స్​ నిర్మించనున్నాయి. 

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, ఓఆర్​ఆర్​కి దగ్గరగా  మొత్తం 4 ఎకరాల్లో 65 అంతస్తులతో 242 మీటర్ల ఎత్తుతో టవర్స్ రానున్నాయి. ఈ ప్రాజెక్ట్​కు ఇప్పటికే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రేరా) అనుమతి ఇచ్చింది. త్వరలో జరిగే భూమి పూజకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు.

పెంట్ హౌస్ రూ.62 కోట్లా..!

ఈ అపార్ట్‌మెంట్లు ఒక్కో ఫ్లాట్​ రేటు సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.18 కోట్ల వరకు ఉంటుంది. పెంట్‌హౌస్‌లకు రూ.30 కోట్ల నుంచి 62 కోట్ల వరకు ధరలు నిర్ణయించారు. ఇప్పటికే 8 పెంట్ హౌస్ లు అమ్ముడుకాగా.. అందులో ఒకదానికి రూ.62 కోట్లు పలికింది. పెంట్‌హౌస్‌ల విక్రయాల ద్వారానే రూ.250 కోట్లు వస్తాయని అంచనా వేశారు. మొత్తం టవర్స్ నిర్మాణానికి ల్యాండ్ తో కలిపి సుమారు రూ. రూ.2 వేల కోట్లు ఖర్చు చేయనుండగా.. అన్ని కలిపి రూ.4,200 కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు. 

►ALSO READ | హనుమకొండ జిల్లా పరకాలలో సీఎం పర్యటనను సక్సెస్ చెయ్యాలి

మే 15, 2031 లోగా కంప్లీట్ చేసి కొనుగోలుదారులకు అప్పగించాలని రేరా ఉత్తర్వులు జారీ చేసింది.  మూడేండ్లలో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ సంస్థలు తెలిపాయి.  

దేశంలో ట్రంప్ టవర్స్ పేరుతో ఇప్పటికే 8 ప్రాజెక్టులు ప్రకటించిన ట్రిబేకా డెవలపర్స్..​ దక్షిణ భారతంలో తొలిసారిగా ట్రంప్​ ​పేరిట  హైదరాబాద్​లో ఈ టవర్స్​ నిర్మించబోతోంది. హైదరాబాద్ లో ఒక ప్రాజెక్ట్ చేపట్టాలని అనుకుంటున్నామని, అది ఇప్పుడు సాధ్యమయ్యిందని  ట్రిబెకా డెవలపర్ ఫౌండర్​ కల్పేశ్ మెహతా తెలిపారు.