హనుమకొండ జిల్లా పరకాలలో సీఎం పర్యటనను సక్సెస్ చెయ్యాలి

హనుమకొండ జిల్లా పరకాలలో సీఎం పర్యటనను సక్సెస్ చెయ్యాలి

పరకాల/ గ్రేటర్​వరంగల్/ కాశీబుగ్గ (కార్పొరేషన్)​​, వెలుగు : హనుమకొండ జిల్లా పరకాలలో సీఎం రేవంత్​రెడ్డి పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల ఆఫీసర్లు సమన్వయంతో పనిచేసి సక్సెస్ చెయ్యాలని కలెక్టర్​ చాహత్​ బాజ్​పాయ్ అన్నారు. మంగళవారం వరంగల్​ సీపీ ఎన్.శ్వేతతో కలిసి పరకాలలో పర్యటించారు. ఈ నెల 16న సీఎం పరకాలలోని వంద పడకల ఆస్పత్రి, డిగ్రీ కళాశాల భవనాలను ప్రారంభించడంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థపానలు చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో కలెక్టర్, సీపీ హెలిప్యాడ్, ఆసుపత్రి, కళాశాల భవనం, సభ నిర్వహించే మైదానం, యంగ్ ఇండియా రెసిడెన్షియల్​ స్కూల్​ స్థలాలను పరిశీలించి, ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. సీపీ మాట్లాడుతూ సీఎం భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. అంతకుముందు కలెక్టర్​ హనుమకొండ రాంనగర్​ ప్రాంతలో సీపీ, బల్దియా కమిషనర్​ వెంకటన్నతో కలిసి రోడ్డు విస్తరణ పనులకు ఏర్పాటుతున్న సమస్యను పరిశీలించారు. కమిషనర్​ వెంకన్న బాలసముద్రంలోని డబుల్​బెడ్​రూం ఇండ్ల సముదాయం, సీవేజ్​ట్రీట్​మెంట్​ప్లాంట్​ను పరిశీలించి ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు.