జయశంకర్ భూపాలపల్లి: నిధుల పక్కదారిపై ఆరా

జయశంకర్ భూపాలపల్లి: నిధుల పక్కదారిపై ఆరా

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: జిల్లాలోని ప్రీ ప్రైమరీ నిధుల పక్కదారిపై విద్యాశాఖ ఆరా తీస్తుంది. ఈ నెల 10న ‘వీ6, వెలుగు’లో ప్రచురితమైన ప్రైమరీ నిధులు పక్కదారి కథనానికి జిల్లా విద్యాశాఖ అలర్ట్ అయింది. 11 పాఠశాలల నిధుల వినియోగంపై జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మంగళవారం పరిశీలన చేపట్టారు.