మహబూబాబాద్, వెలుగు: పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులు ఊడి పడడంతో మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఏఎస్సై శ్రీనివాస్కు గాయాలయ్యాయి. సోమవారం రాత్రి పోలీస్ స్టేషన్ లో సడెన్‌గా పైకప్పు పెచ్చులు ఊడి పడడంతో డ్యూటీలో ఉన్న ఏఎస్సై గాయపడ్డారు. అతడిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్లు తెలిపారు.
అలాగే స్టేషన్ లోని కంప్యూటర్, ప్రింటర్ సైతం దెబ్బతిన్నాయి. ఇదిలాఉంటే పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్ నిర్మాణం పూర్తయినప్పటికీ, ఇంకా ప్రారంభించలేదు. దీంతో పోలీసులు పాత బిల్డింగ్‌లోనే డ్యూటీ చేస్తున్నారు. ఇప్పటికైనా కొత్త బిల్డింగ్‌ను ప్రారంభించాలని పోలీసులు కోరుతున్నారు.
