ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త స్టార్టప్ క్రియేట్ చేసింది. రైతులకు మరింత ఆదాయం వచ్చే దిశగా ప్రాజెక్ట్ రూపొందించింది. ఈ కొత్త ప్రాజెక్ట్ సనాతన ధర్మం నుంచి పుట్టింది. ఇంతకీ అది ఏంటీ అంటారా గో మూత్రం అమ్మకం. ఒక లీటర్ గో మూత్రం 10 రూపాయలు.. మంచినీళ్ల బాటిళ్లు అమ్మినట్లు.. ఈ గో మూత్రం బాటిళ్లను అమ్మటం అన్నమాట.. రైతులకు మరింత ఆదాయం వచ్చే విధంగా దీన్ని ప్రారంభించటం దేశంలో ఇదే ఫస్ట్ టైం..
15 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టుగా:
పైలెట్ ప్రాజెక్టుగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఈ పథకాన్ని పట్టాలు ఎక్కిస్తున్నారు. మొదటి విడతలో భాగంగా 15 గ్రామాల్లో అమలు చేస్తున్నారు. లీటర్ గోమూత్రం 10 రూపాయల చొప్పున రైతులకు చెల్లిస్తారు. రైతుల నుంచి సేకరించిన గో మూత్రాన్ని వ్యవసాయంలో.. రసాయన ఆధారిత ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలకు ప్రభుత్వం నేరుగా అమ్ముతుంది.
ఈ పథకం ఎలా పని చేస్తుందంటే..?:
యూపీలోని బులంద్ షహెర్ ప్రాంతంలోని నర్సైనా అనే గ్రామంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు అధికారులు. దీనికి డాక్టర్ ప్రవీణ్ నాయకత్వం వహిస్తున్నారు. గ్రామంలోని పాడి రైతుల ఉత్పత్తిదారుల సంఘం నుంచి.. పాలు సేకరించినట్లే.. గో మూత్రాన్ని సేకరించనున్నారు అధికారులు. రోజూ 500 లీటర్ల గో మూత్రం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయా కేంద్రాల దగ్గర గో మూత్రాన్ని నిల్వ చేయటానికి 200 లీటర్ల సింటెక్స్ ట్యాంకులు సిద్ధం చేశారు.
ఒక్కో లీటర్ గో మూత్రానికి 10 రూపాయలు చెల్లిస్తుంది ప్రభుత్వం. పాలు ఇవ్వని ఆవుల పోషణకు అవసరం అయిన పశుగ్రాసానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని చెబుతున్నారు అధికారులు. ఈ గో మూత్రం సేకరణ పథకంలో ఇప్పటికే 300 మంది మహిళలు సభ్యత్వం తీసుకున్నట్లు చెబుతున్నారు అధికారులు. ఈ మహిళలు ఏడాదికి 2 లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ మరో స్కీమ్ కూడా ఉంది.. ఆవులు లేని రైతులు, మహిళలకు మరో అవకాశం ఉంది. ఒక లీటర్ గో మూత్రం సేకరించి ఇచ్చిన మహిళలకు 2 రూపాయల కమీషన్ ఇస్తున్నారు కూడా..
రాజకీయ రాద్దాంతం:
రాబోయే ఏడాదిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని.. ఈ క్రమంలోనే యోగి సర్కార్ హిందూత్వం ఎజెండాను తెరపైకి తెస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలు, పేదలు ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయారని.. అలాంటి వాళ్లకు ప్రభుత్వం ఎర వేస్తుందని ఆరోపిస్తున్నాయి పార్టీలు.
ఇప్పటికే యూపీలో ఏర్పాటు చేసిన గో శాలలు చాలా దారుణంగా ఉన్నాయని.. గోశాలల్లోనే ఆవులు చనిపోతున్నాయని.. వాటిని పట్టించుకోకుండా గోమూత్రం పేరుతో కొత్త డ్రామా మొదలుపెట్టారంటూ విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు.
యూపీ ఎన్నికల ముందు 15 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ గోమూత్రం పథకం.. యోగి ప్రభుత్వానికి కలిసొస్తుందా లేదా అనేది వెయిట్ అండ్ వాచ్..
🚨 The Uttar Pradesh government to purchase cow urine from farmers for Rs 10/Liter.
— Indian Tech & Infra (@IndianTechGuide) August 12, 2026
The cow urine collected is expected to be used as a raw material for agricultural purposes. pic.twitter.com/2MuBcRiAhg
