హైదరాబాద్ సిటీలో అతిపెద్ద జంక్షన్ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ అమలులోకి రానుంది. ‘హెచ్ -సిటీ’ ప్రాజెక్ట్ కింద చేపట్టిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలు.. రోడ్డు నంబర్1 మీదుగా వెళ్లి ఎన్టీఆర్ భవన్ సిగ్నల్ వద్ద ఎడమ వైపు తీసుకుని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, బీఆర్‌ఎస్ భవన్, ఒమేగా హాస్పిటల్, జర్నలిస్ట్ కాలనీ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 మీదుగా ప్రయాణం చేయాలి.
మాదాపూర్ నుంచి పంజాగుట్ట వచ్చే వాహనాలు.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, ఎన్టీఆర్ భవన్, ఎల్వీ ప్రసాద్, రోడ్ నంబర్1 మీదుగా ప్రయాణించాలి. ఈ మార్గంలో ఎక్కడా రైట్టర్న్కు అవకాశం లేదు. ఈ నెల 18 నుంచి అమల్లోకి రానున్న ఈ వన్ వే విధానం.. ఫ్లై ఓవర్, అండర్ పాస్ పనులు పూర్తయ్యేంత వరకు దాదాపు ఏడాదిన్నర పాటు కొనసాగనుంది.
ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్‌తో కలిసి సీపీ సజ్జనార్ మంగళవారం వివరాలు వెల్లడించారు. కేబీఆర్ పరిసర ప్రాంతాల్లో ట్రావెల్ చేసే వాహనదారులు సైన్ బోర్డులను అనుసరించి ప్రయాణించాలని సూచించారు. ఈ ఆంక్షలు ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యేంత వరకు అమలులో ఉంటాయని వెల్లడించారు.
కుడి నుంచి ఎడమకు లేన్ మార్పులు:
* TG స్టడీ సర్కిల్ వద్ద U-టర్న్
* BRS భవన్ వద్ద U-టర్న్
* ఒమేగా హాస్పిటల్ వద్ద U-టర్న్
* జానారెడ్డి వద్ద U-టర్న్
* అపోలో క్రెడిల్ వద్ద U-టర్న్
* తాజ్ మహల్ వద్ద U-టర్న్
* ఫీనిక్స్ బిల్డింగ్ వద్ద U-టర్న్
* రోడ్ నం. 65 వద్ద U-టర్న్
* మంత్రి టవర్స్ వద్ద U-టర్న్
* క్రీమ్ స్టోన్ వద్ద U-టర్న్
ఎడమ నుంచి కుడికి లేన్ మార్పులు:
* TG స్టడీ సర్కిల్ వద్ద U-టర్న్
* BRS భవన్ వద్ద U-టర్న్
* ఒమేగా హాస్పిటల్ వద్ద U-టర్న్
* జానారెడ్డి వద్ద U- టర్న్
* అపోలో క్రెడిల్ వద్ద U-టర్న్
* తాజ్ మహల్ వద్ద U-టర్న్
* ఫీనిక్స్ బిల్డింగ్ వద్ద U-టర్న్
* రోడ్ నం. 65 వద్ద U-టర్న్
* మంత్రి టవర్స్ వద్ద U-టర్న్
* క్రీమ్ స్టోన్ వద్ద U-టర్న్
బయటకు వెళ్లే మార్గాలు:
* రోడ్ నం. 14
* నంది నగర్
* రోడ్ నం. 10, జహీర్ నగర్
* న్యూ వరల్డ్
* అగ్రసేన్ ఐలాండ్, రోడ్ నం. 12
* ఒమేగా హాస్పిటల్, లోటస్ పాండ్
* TTD ఆలయ రోడ్డు
* BVB జంక్షన్ మరియు ఫిల్మ్ నగర్
* జర్నలిస్ట్ కాలనీ
* రోడ్ నం. 45
* రోడ్ నం. 36 మరియు పెద్దమ్మ ఆలయం
* అన్నపూర్ణ స్టూడియో బైలేన్ NTR భవన్
