పరకాల/ గ్రేటర్వరంగల్/ కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు : హనుమకొండ జిల్లా పరకాలలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల ఆఫీసర్లు సమన్వయంతో పనిచేసి సక్సెస్ చెయ్యాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. మంగళవారం వరంగల్ సీపీ ఎన్.శ్వేతతో కలిసి పరకాలలో పర్యటించారు. ఈ నెల 16న సీఎం పరకాలలోని వంద పడకల ఆస్పత్రి, డిగ్రీ కళాశాల భవనాలను ప్రారంభించడంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థపానలు చేయనున్నారు.
ఈ నేపథ్యంలో కలెక్టర్, సీపీ హెలిప్యాడ్, ఆసుపత్రి, కళాశాల భవనం, సభ నిర్వహించే మైదానం, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ స్థలాలను పరిశీలించి, ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. సీపీ మాట్లాడుతూ సీఎం భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. అంతకుముందు కలెక్టర్ హనుమకొండ రాంనగర్ ప్రాంతలో సీపీ, బల్దియా కమిషనర్ వెంకటన్నతో కలిసి రోడ్డు విస్తరణ పనులకు ఏర్పాటుతున్న సమస్యను పరిశీలించారు. కమిషనర్ వెంకన్న బాలసముద్రంలోని డబుల్బెడ్రూం ఇండ్ల సముదాయం, సీవేజ్ట్రీట్మెంట్ప్లాంట్ను పరిశీలించి ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు.
