హైదరాబాద్, వెలుగు: ప్రాజెక్ట్ సెరటోనిన్ తన పదో తరం ప్రివెంటివ్ హెల్త్ ప్లాట్‌ఫారమ్ ప్రెసిషన్ హెల్త్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) లాంచ్ చేసింది. పెద్ద ఆసుపత్రులు, మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు నిరంతర వ్యక్తిగత నివారణ సంరక్షణ అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. నాన్–కమ్యూనికబుల్ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా 75 శాతం మరణాలకు కారణం అవుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
సరైన నివారణ చర్యల ద్వారా ఆసుపత్రిలో చేరడాన్ని 20 నుంచి 30 శాతం వరకు తగ్గించవచ్చని ఫిక్కీ అంచనా వేసింది. దీనిలో ఉండే ప్రెసిషన్ హెల్త్ ఓఎస్ వ్యక్తిగత ఆరోగ్య ప్రొఫైల్‌ను అంచనా వేస్తుంది. ఎపిసోడిక్ ట్రీట్మెంట్ నుంచి ప్రెసిషన్ ప్రివెన్షన్‌కు మారడానికి సహాయపడుతుంది.
