పంకజ్ త్రిపాఠి, రాజేష్ కుమార్, గీతా అగర్వాల్ శర్మ, పవన్ మల్హోత్రా, శ్రీధర్ దూబే ప్రధాన పాత్రల్లో అమిత్ రాయ్ రూపొందించిన హిందీ చిత్రం ‘ఓ మై డాగ్’. రాజేష్ భరద్వాజ్, అమిత్ రాయ్, సనా వార్సీ నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తెలియజేసేందుకు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శశికిరణ్ తిక్క మాట్లాడుతూ ‘ఇప్పుడిప్పుడే మన దేశంలో డాగ్స్ నేపథ్యంలో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి.
అమిత్ రాజ్ గారు గతంలో తీసిన ‘ఓ మై గాడ్ 2’ తరహాలో ఈ చిత్రం కూడా తప్పకుండా చూసి ఆనందించాల్సిన సినిమా’ అని చెప్పాడు. దర్శకుడు అమిత్ రాయ్ మాట్లాడుతూ ‘డాగ్స్ తమ ప్రేమను, నిజాయితీని నిరూపించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాయి. అదే ఈ కథకు మూలం. అవి చూపించేంత ప్రేమ, కరుణను ఇంకెవరూ చూపించలేరు. అదే ఈ సినిమా చూడటానికి ప్రధాన కారణం. ఈ కథ మిమ్మల్ని కదిలిస్తుంది. మీలో ప్రేమను నింపుతుంది’ అని చెప్పారు. రాజేష్ కుమార్, డాలీషా చౌరాసియా తదితరులు పాల్గొన్నారు.
