బతికుండగానే చంపేశారు ! మృతుడిగా నమోదు చేసి పింఛన్ ఆపేసిన అధికారులు

బతికుండగానే చంపేశారు ! మృతుడిగా నమోదు చేసి పింఛన్ ఆపేసిన అధికారులు
  • అధికారులపై చర్యలు తీసుకోవాలని దివ్యాంగుడి డిమాండ్

శంకరపట్నం, వెలుగు: సాధారణంగా లబ్ధిదారు మృతిచెందిన తర్వాత ఒకటి, రెండు నెలలకు ఆసరా పింఛన్​ నిలిపివేస్తారు. కానీ కరీంనగర్‌‌ జిల్లా శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామంలో ఓ దివ్యాంగ పెన్షన్‌‌దారుడు బతికుండగానే మృతి చెందినట్లు అధికారిక వెబ్‌‌సైట్‌‌లో నమోదు చేసి పింఛన్​ నిలిపివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మెట్టుపల్లి గ్రామానికి చెందిన తోట శ్రీనివాస్‌‌ (39) దివ్యాంగుల పింఛన్​ పొందుతున్నారు. అయితే జూన్‌‌ 4న శ్రీనివాస్‌‌ మృతిచెందినట్లు అధికారిక వెబ్‌‌సైట్‌‌లో నమోదు కావడంతో ఆయనకు పింఛన్​ నిలిచిపోయింది. తాను బతికే ఉన్నప్పటికీ మృతుడిగా ఎలా నమోదు చేశారంటూ శ్రీనివాస్‌‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను మృతుడిగా నమోదు చేసిన అధికారులపై చర్యలు తీసుకుని పింఛన్​ను పునరుద్ధరించాలని శ్రీనివాస్‌‌ కోరుతున్నారు. ఈ ఘటనపై అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.