ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అభిషేక్‌‌‌‌‌‌‌‌ పోరెల్‌‌‌‌‌‌‌‌ అరెస్ట్‌‌‌‌‌‌‌‌

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అభిషేక్‌‌‌‌‌‌‌‌ పోరెల్‌‌‌‌‌‌‌‌ అరెస్ట్‌‌‌‌‌‌‌‌

కోల్‌‌‌‌‌‌‌‌కతా: అత్యాచారం కేసులో బెంగాల్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ అభిషేక్‌‌‌‌‌‌‌‌ పోరెల్‌‌‌‌‌‌‌‌ను హుగ్లీ జిల్లా పోలీసులు మంగళవారం అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఓ వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌) సెక్షన్‌‌‌‌‌‌‌‌ 69తో పాటు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

కర్ణాటకకు చెందిన ఓ వైద్య విద్యార్థిని జూన్‌‌‌‌‌‌‌‌ 23న మోగ్రా పోలీసు స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఇద్దరం కలిసి విదేశాలకు కూడా వెళ్లామని తెలిపింది. గత ఏడాది నుంచి తమ మధ్య విభేదాలు తలెత్తాయని, తనపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపించింది. 

దాదాపు మూడేళ్ల పాటు ఇద్దరి మధ్య సంబంధం ఉందని వెల్లడించింది. విద్యార్థి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అభిషేక్‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించినా అతని ఆచూకీ లభించలేదు. దీంతో ఆ యువతి కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నిందితుడిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.