- హుజురాబాద్ అభివృద్ధికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డే అడ్డంకి
జమ్మికుంట, వెలుగు: హుజురాబాద్ అభివృద్ధికి అడ్డంకిగా మారిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే రాళ్ల దెబ్బలు తప్పవని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాల్లో రూ.11 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ మంత్రుల సమక్షంలో సజావుగా సాగుతుంటే కౌశిక్‌రెడ్డి కావాలనే వివాదాస్పదం చేశాడని మండిపడ్డారు.
నిత్యం సోషల్‌మీడియాలో ఉండేందుకు సైకోగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ఇప్పటికే ఎమ్మెల్యే వైఖరి పట్ల నిధులు రాక ఇబ్బందులు పడుతున్న వేళ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి ఓర్వలేకనే మాట్లాడుతున్నాడని ఫైర్అయ్యారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పరుశరాములు, సాయిని రవి పొనగంటి మల్లయ్య, ఎర్రబెల్లి రాజేశ్వరరావు, పుల్లూరి సదానందం, పిడుగు భాగ్యలక్ష్మితో పాటు తదితరులు పాల్గొన్నారు.
