టీజీ ఐసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తి.. ఆగస్ట్ 14 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపునకు చాన్స్

టీజీ ఐసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తి.. ఆగస్ట్ 14 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపునకు చాన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఐసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మంగళవారం వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. మొత్తం 401 కాలేజీల్లో ఉన్న 36,241 సీట్లకు.. 19,526 సీట్లు భర్తీ అయ్యాయని, ఇంకా 16,715 సీట్లు మిగిలి ఉన్నాయని అడ్మిషన్ల కన్వీనర్ ఏ.శ్రీదేవసేన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కన్వీనర్ కోటా కింద మొత్తం 20,469 మంది ఆప్షన్లు ఇచ్చుకోగా, అందులో 19,526 మందికి సీట్లు దక్కాయి.

ఈడబ్ల్యూఎస్ కోటా కింద 448 మందికి సీట్లు కేటాయించారు. స్పోర్ట్స్, ఎన్సీసీ కోటా సీట్లను తుది విడత కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌లో భర్తీ చేయనున్నారు. కాగా, మొత్తం 309 ఎంబీఏ కాలేజీల్లో 29,457 సీట్లు ఉండగా..16,896 సీట్లు (57 శాతం) భర్తీ అయ్యాయి. ఇందులో 25 వర్సిటీ కాలేజీల్లో 1,550 సీట్లకు 1,305 (84 శాతం) నిండగా, నాలుగు గవర్నమెంట్ కాలేజీల్లో 260 సీట్లకు 248 (95 శాతం) సీట్లు నిండాయి. 280 ప్రైవేట్ కాలేజీల్లో 27,647 సీట్లకు 15,343 (55 శాతం) భర్తీ అయ్యాయి.

ఇక 92 ఎంసీఏ కాలేజీల్లో 6,784 సీట్లకు కేవలం 2,630 సీట్లు (39 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 14వ తేదీలోపు ట్యూషన్ ఫీజును ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ద్వారా చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత అభ్యర్థులు ఈనెల 22 నుంచి 24 మధ్యలో కేటాయించిన కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సీటు వదులుకోవాలనుకుంటే ఈనెల 23 వరకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://tgicet.nic.in వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ను చూడాలని అధికారులు సూచించారు.