డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..

ఫహద్ ఫాజిల్ హీరోగా రూపొందుతున్న ఫాంటసీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌‌’. శశాంక్ యేలేటి దర్శకుడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ విడుదల కాగా,  తాజాగా ‘కేకు వాకు’ అనే వీడియో సాంగ్‌‌ను విడుదల చేశారు. 

‘‘సూరి, సూరి, జంగల్‌‌ కా రాజా.. సూరి, సూరి, మొదలెడితే బాజా.. సూరి, సూరి, కల్లాసే ఇక..”అంటూ సాగిన ఈ  పాటను కాల భైరవ కంపోజ్ చేయడంతో పాటు ఎంసీ హరితో కలిసి క్యాచీ లిరిక్స్ అందించారు. సూరి డేర్‌‌డెవిల్ క్యారెక్టరైజేషన్‌‌ను, అతనికి ప్రతి పని ఎంత ఈజీగా, ‘కేక్‌‌వాక్’లా ఉంటుంద‌‌నే విష‌‌యాన్ని ఇందులో హైలైట్ చేశారు. 

ఫహాద్ ఫాజిల్, కాల భైరవ, స్సారా కాంబినేషన్‌‌లో చిత్రీకరించిన ఈ వీడియో సాంగ్‌‌ ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 11న సినిమా విడుదల కానుంది.