స్పెషలిస్ట్ డాక్టర్ల మెరిట్ లిస్ట్ విడుదల

స్పెషలిస్ట్ డాక్టర్ల మెరిట్ లిస్ట్ విడుదల
  • రేపు, ఎల్లుండి సర్టిఫికెట్ వెరిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ)   ఆప్తాల్మాలజీ, ఈఎన్‌‌‌‌‌‌‌‌టీ, పాథాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ సహా మొత్తం10 స్పెషాలిటీ విభాగాలకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును   మంగళవారం విడుదల చేసింది. మొత్తం 1,616 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, ఇప్పటికే వివిధ దశల్లో 1,192 పోస్టుల భర్తీ పూర్తయింది.

తాజా లిస్టు ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌కు ఎంపిక చేశారు. వీరికి ఈ నెల13,14 తేదీల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లోని వెంగల్‌‌‌‌‌‌‌‌రావునగర్ ఇండియన్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ లో సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించనున్నారు. అనివార్య కారణాలతో హాజరుకాలేని వారి కోసం ఆగస్టు 17ను రిజర్వ్ డేగా కేటాయించారు.