- జాతీయ స్థాయిలో 43వ, జోన్ పరిధిలో 9వ స్థానం
పద్మారావునగర్, వెలుగు: ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఐఐఆర్ఎఫ్)–-2026 ప్రకటించిన ప్రభుత్వ వైద్య కళాశాలల ర్యాంకింగ్స్‌లో సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీ అద్భుత ప్రతిభ కనబరిచింది. రాష్ట్రంలో ఫస్ట్‌ప్లేస్‌లో నిలవడమే కాకుండా.. జాతీయ స్థాయిలో 43వ, జోన్ పరిధిలో 9వ ర్యాంకులుసొంతం చేసుకుంది. విద్యా ప్రమాణాలు, వసతులు, ఇతర సేవలను ప్రాతిపదికగా తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటించారు. దీంతో లెక్చరర్లు, డాక్టర్లు, విద్యార్థులు మంగళవారం ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఇందిరను సన్మానించి, కేక్ కట్ చేశారు.
కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్‌చంద్రశేఖర్, డాక్టర్ రాజారాం, డాక్టర్ బి.వి.నాగ మోహన్, టీజీడీఏ గాంధీ యూనిట్ అధ్యక్షుడు డాక్టర్ ఆవుల మురళీధర్, జూడా అధ్యక్షుడు డాక్టర్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. అందరి సమష్టి కృషితోనే జాతీయ స్థాయి గుర్తింపు సాధ్యమైందని, భవిష్యత్తులోనూ విద్య, వైద్య సేవల్లో కాలేజీని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.
