ఇంటి ఓనర్ల అహంకారానికి, అన్యాయాలకు చెక్ పెట్టాలంటే కేవలం గొడవ పడాల్సిన పనిలేదు.. మైండ్ గేమ్‌తో టెక్నాలజీతో బుద్ధి చెప్పవచ్చని ఓ జెన్ జెడ్ కుర్రోడు నిరూపించాడు. అద్దె ఆలస్యం అయితే ఫైన్ వేస్తానన్న ఓనర్‌కు.. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న రిపేర్ల బిల్లుతో చుక్కలు చూపించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్రేజీ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి..
'డెకిమ్ కల్వినో' అనే ఎక్స్ యూజర్ షేర్ చేసిన ఈ స్టోరీ వివరాల్లోకి వెళితే.. ప్రతి నెలా 5వ తేదీలోపు అద్దె చెల్లించకపోతే ఓనర్ భారీగా ఫైన్లు వసూలు చేసేవాడట. అనుకోని కారణాల వల్ల ఆ కుర్రోడి పొరుగున ఉన్న జెన్ జెడ్ కుర్రోడు 6వ తేదీన అద్దె చెల్లించాడు. దీంతో ఓనర్ వెంటనే ఫైన్ వేశాడు.
My landlord fined tenants for paying rent after the 5th. My Gen Z neighbour paid on the 6th & got fined. He paid without arguing, then created a spreadsheet documenting every repair request the landlord had ignored, including dates and screenshots.When the landlord threatened....
— 𝐌𝐫.𝐊𝐀𝐋™ (@dekim_Kalvino) October 16, 2026
సాధారణంగా అయితే ఎవరైనా ఓనర్స్ ఇలా బిహేవ్ చేస్తే గొడవకు దిగుతారు. కానీ ఆ కుర్రోడు అలా చేయలేదట. చాలా కూల్‌గా ఓ ప్లాన్ వేసాడు. ఓనర్ తన ఇంటి మెయింటెనెన్స్ కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదో గుర్తు చేసుకున్నాడు. వాటికి సంబంధించిన డేట్స్, స్క్రీన్ షాట్లు, ఫొటోలతో ఒక పక్కా స్ప్రెడ్‌షీట్ రెడీ చేశాడు. ఆ తర్వాత ఆ లింక్‌ను అపార్ట్మెంట్లోని మిగతా టెనెంట్స్‌కు షేర్ చేశాడు. అంతే అందరూ తమ ఇంట్లో ఉన్న సమస్యలను, ఓనర్ నిర్లక్ష్యాన్ని ఆ షీట్లో నోట్ చేశారు. చూస్తుండగానే అది ఓ పెద్ద సాక్ష్యాల పత్రంగా మారిపోయింది.
మరుసటి నెలలో ఓనర్ ఎప్పటిలాగే అద్దె చెల్లించాలంటూ రిమైండర్ పంపాడు. దానికి ఆ కుర్రోడు ఇచ్చిన రిప్లై చూసి ఓనర్ దిమ్మతిరిగిపోయింది. "అద్దె చెల్లించడానికి 5వ తేదీ డెడ్‌లైన్ అయితే.. మా రిపేర్ల గోడు వినిపించుకోకుండా మీరు నిర్లక్ష్యం చేసి సరిగ్గా 63 రోజులు పూర్తయ్యింది" అంటూ ఆ స్ప్రెడ్‌షీట్‌ను ట్యాగ్ చేశాడు.
ఈ దెబ్బతో కంగారుపడిన ఓనర్.. వెంటనే అతనికి ఫోన్ చేసి ఆ స్ప్రెడ్‌షీట్‌ను వెంటనే డిలీట్ చేయాలని డిమాండ్ చేశాడు. కానీ ఆ కుర్రోడు తగ్గేదే లే అన్నాడు. "రూల్స్ ఇద్దరికీ వర్తిస్తాయి. అద్దె ఆలస్యం అయితే ఫైన్ వేసినప్పుడు.. రిపేర్లు చేయకపోతే మాకూ బిల్లు చెల్లించాలి" అని తేల్చిచెప్పాడు. దీంతో చేసేది లేక ఓనర్ ఫోన్ కట్ చేశాడు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ జెన్ జెడ్ కుర్రోడి తెలివితేటలను తెగ ప్రశంసిస్తున్నారు. అద్దెదారులు చట్టపరంగా తమ హక్కులను ఎలా కాపాడుకోవాలో ఈ ఘటన కళ్లకు కట్టింది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో టెనెంట్లకు అనుకూల చట్టాలు ఉన్నాయని.. ఓనర్లు రిపేర్లు చేయకపోతే లీగల్ రూట్లో ముందుకు వెళ్లవచ్చని పలువురు గుర్తు చేస్తున్నారు. ప్రశ్నించే తత్వం, డిజిటల్ సాక్ష్యాలు ఉంటే ఎవరినైనా దారికి తెచ్చుకోవచ్చని ఈ కుర్రోడు నిరూపించాడు.
