ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు: బాలల నెట్ వినియోగంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు: బాలల నెట్ వినియోగంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

బాలల ఇంటర్నెట్ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇంటర్నెట్ వినియోగం అనేది ప్రాథమిక హక్కు అని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 19(1)(ఎ) ప్రకారం ఇంటర్నెట్ వినియోగం అనేది అందరికీ ప్రాథమిక హక్కు అని.. బాలలు కూడా అదే హక్కును కలిగిఉన్నారని 2026 అక్టోబర్ 27న వెలువరించిన తీర్పులో పేర్కొంది. 

జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కే.వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ మేరకు తీర్పును వెలువరించింది. పిల్లలకు ఇంటర్నెట్ నిషేధించడం అంటే వారికి వాక్ స్వాంతంత్ర్యం లేదని చెప్పడమేనని అభిప్రాయపడింది. పిల్లల భద్రత, స్వేచ్ఛ.. రెండింటినీ వేర్వేరుగా చూడవద్దని.. భద్రత ఎంత ముఖ్యమో స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యమని పేర్కొంది. 

సోషల్ మీడియా వేదికలలో బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్, దుర్వినియోగానికి సంబంధించిన కటెంట్ ను గుర్తించి నిషేధించే క్రమంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేసింది. 

  పిల్లలపై సోషల్ మీడియా వినియోగంపై ఎలాంటి పూర్తి నిషేధం (blanket ban) విధించరాదని, అయితే వారి భద్రత కోసం తల్లిదండ్రుల పర్యవేక్షణ, చైల్డ్ మోడ్ వంటి   భద్రతా చర్యలు ఉండాలని సూచించింది.

ఢిల్లీలో ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై ఆగ్రహం:

  ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై దాఖలైన విచారణలో, ఇంటర్నెట్ సేవలు నిరంతరాయంగా పనిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు కేంద్ర హోంశాఖ బేషరతు క్షమాపణలు కూడా కోరింది.

ఆన్‌లైన్ వేదికలపై పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను (CSEAM) గుర్తించి తొలగించడానికి ఒక సమగ్ర జాతీయ డేటాబేస్‌ను ఏర్పాటు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.