ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2.96 లక్షల ఓట్లు గాయబ్‌‌‌‌‌‌‌‌

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2.96 లక్షల ఓట్లు గాయబ్‌‌‌‌‌‌‌‌
  • నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌అర్బన్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా 83,429 ఓట్లు గల్లంతు
  •     మిగితా ఐదు సెగ్మెంట్లలో  2,12,873 ఫారాలు రిటర్న్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌రాలే
  •     అన్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌మ్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓట్లకు నోటీసులు ఇచ్చే అవకాశం

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌జిల్లాలో చేపట్టిన సమగ్ర ఓటర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌సర్వే (సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లో 2,96,132 ఓట్ల జాడ తెలియలేదు. మొత్తం 21,35,740 ఓట్లకుగాను 18,39,608 మంది లెక్కలు తేలగా ఆ వివరాలన్నీ డిజిటలైజ్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌చేశారు. డెత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పర్మనెంట్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌షిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రేస్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ఓటర్లను లిస్టు నుంచి తొలగించగా అన్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌మ్యాపింగ్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ఓటర్లకు నోటీసు‌‌‌‌‌‌‌‌లు ఇచ్చే పనులు ‌‌‌‌‌‌‌‌జరుగుతున్నాయి. నిర్ణీత ఆధారాలు చూపని పక్షంలో వారి ఓట్లను 
తొలగిస్తారు. 

ఇందూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కామారెడ్డిలో ఎక్కువ..

ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ సెగ్మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండగా నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరు, కామారెడ్డిలో మూడు ఉన్నాయి. ఓటరు ‌‌‌‌‌‌‌‌లిస్టులోని పేర్ల సంఖ్యకు సమానంగా ఎన్యూమరేషన్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ఫారాలు పంపిణీ చేసిన బీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోలు వాపస్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌వచ్చిన ఫారాల వివరాలను ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌చేశారు.  నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌అర్బన్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3,08,261 ఫారాలు ఇవ్వగా 2,24,832 మాత్రమే రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చాయి. అత్యధికంగా 83,429 ఎన్యూమరేషన్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ఫారాలు వాపస్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌రాలేదు. వీరిలో 5,384 మంది ఓటర్లు చనిపోయారని నిర్ధారించగా మిగితా వారిలో అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పర్మనెంట్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌షిఫ్టెడ్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ఓటర్లు ఉన్నారు. అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి మొత్తం 72.94  శాతం డిజిటలైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి చేశారు. కామారెడ్డి టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా జాడ తెలియని ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంది. 

ఎన్యూమరేషన్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ఫారాలు వాపస్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌వచ్చిన వాటి ఆధారంగా ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో 88.04 శాతం ఓటర్ల వివరాలు అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌అయ్యాయి. బోధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.53, బాన్సు‌‌‌‌‌‌‌‌వాడ 89.87, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 88.23, బాల్కొండ 89.73, జుక్కల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 90.29, ఎల్లారెడ్డిలో 90.17, కామారెడ్డిలో 84.01 శాతం ఓటర్లను డిజిటలైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో చనిపోయిన ఓటర్ల సంఖ్య 33,712 కాగా ఆచూకీ తెలియని ఓట్లు 51,782, జిల్లా నుంచి పర్మనెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వలస వెళ్లిన ఓట్లు 71,598 ఉన్నాయి. ఇతర కారణాలతో 8,978 ఓట్లను బీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోలు గుర్తించలేదు. వీటిలో అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓటర్లు 8,756 ఉండడం గమనార్హం. 2002 ఓటర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మ్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చేసిన ఓట్లు పోను 41,121 ఓట్లు అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాపింగ్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌కింద నమోదుకాగా వారికి నోటీసు‌‌‌‌‌‌‌‌లు అందించనున్నారు. ఎలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌నిర్దేశించిన 12 రకాల్లో ఒక ఆధారాన్ని వారు ఇస్తేనే లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేరు ఉంటుంది. లేకుంటే ఓటు అర్హత కోల్పోతారు.