Ramayana: బ్లాక్ బస్టర్ ‘ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ స్ఫూర్తితో లైవ్-యాక్షన్.. నితీష్ ‘రామాయణ’ AI ఫోటోలు వైరల్!

Ramayana: బ్లాక్ బస్టర్ ‘ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ స్ఫూర్తితో లైవ్-యాక్షన్.. నితీష్ ‘రామాయణ’ AI ఫోటోలు వైరల్!

డైరెక్టర్ నితీష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘రామాయణ’ (Ramayana). సుమారు రూ.4వేలకోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం, పార్ట్ 1 దీపావళి 2026లో, పార్ట్ 2 2027లో విడుదల కానుంది.

భారీ తారాగణంతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, రావణుడుగా యష్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడుగా రవి దూబే, హనుమాన్ గా సన్నీ డియోల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ఈ మూవీ తొలి ప్రోమో విడుదలతోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. భారతీయ సినీ చరిత్రలో ఇంతవరకు రూపొందని అతిపెద్ద చిత్రంగా ప్రచారం చేయబడుతున్న ఈ సినిమా, మరోసారి వార్తల్లో నిలిచింది. 

లేటెస్ట్గా, ఒక డిజిటల్ క్రియేటర్.. తన సోషల్ మీడియాలో ఆసక్తిరేపే ఫోటోలు పంచుకున్నారు. ఈ డిజిటల్ క్రియేటర్ AI-generated ఫోటోలను విడుదల చేసి, అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.

అయితే, ఈ ఫోటోలు, డైరెక్టర్ తివారి తెరకెక్కించే రామాయణ స్టార్ కాస్ట్‌ని, మరియు 1993లో వచ్చిన బ్లాక్ బస్టర్ "రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ" యానిమేషన్ ప్రపంచంలోని దృశ్యాలతో మిళితం చేసి చూపిస్తున్నట్లుగా అద్భుతంగా ఉంది. 

ఈ ఫోటోలు గమనిస్తే,

సన్నీ డియోల్ హనుమంతునిగా సముద్రం మీద ఆకాశంలోకి ఎగురుతున్నట్లు

రణబీర్ కపూర్ రాముడిగా యుద్ధభూమిపై కత్తి పట్టుకుని నిలిచున్నట్లు

శ్రీ రాముడు సీత కోసం శ్రీ శివుని పినాక బాణాన్ని విరచడం

యష్ రావణగా సాయి పల్లవి (సీత) ను లంకకు తీసుకెళ్తున్న సన్నివేశాలు

అయితే, ఈ AI ఫోటోలన్నీ నోస్టాల్జియాతో పాటు మోడర్న్ స్టార్ పవర్‌ను మిళితం చేస్తూ ఇంట్రెస్ట్ పెంచుతోన్నాయి. అంటే, రాబోయే రామాయణ ప్రాజెక్ట్ లో లైవ్-యాక్షన్ ఘట్టాలు.. ఎలాంటి విజువల్ ట్రీట్ అందించనున్నాయో అనే ఆలోచనలో పడేసింది. ఈ క్రమంలో సినీ ఆడియన్స్ భారీ రామాయణ ఘట్టాన్ని చూడటం కోసం వెయిటింగ్ అని కామెంట్స్ పెడుతున్నారు. 

►ALSO READ | Devkhel Review: దేవుడి పేరుతో వరుస హత్యలు.. ఓటీటీలో ఉత్కంఠ రేపుతున్న క్రైమ్ థ్రిల్లర్

రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ:

1993లో విడుదలైన Ramayana: The Legend of Prince Rama భారతీయ ఇతిహాసాన్ని చూపించిన అత్యంత ప్రసిద్ధ యానిమేషన్. ఇండో-జపనీస్ సహకారంలో యుగో సాకో, కోయిచీ సాసాకీ, రామ్ మొహన్ దర్శకత్వం వహించిన ఈ యానిమేషన్ హిందీ, ఇంగ్లీష్ రెండు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. IMDbలో 9.2 రేటింగ్ సంపాదించుకుంది. ఇది అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.