“దేవ్‌ఖేల్ (Devkhel)” ఒక మరాఠీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ జనవరి 30, 2026 నుండి జీ (ZEE5) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ నటుడు అంకుష్ చౌదరి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్, కొంకణ్ ప్రాంతం నేపథ్యంలో జరిగే ఆచార హత్యల చుట్టూ తిరుగుతుంది.
దర్శకుడు చంద్రకాంత్ లతా గైక్వాడ్ మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌తో భిన్నమైన కథాంశంతో ఈ సిరీస్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ మూవీ ఆడియన్స్ను ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇందులో ప్రజక్తా మాలి, అరుణ్ నలవాడే, నారాయణ్ జాదవ్, యతిన్ కార్యేకర్, మంగేష్ దేశాయ్, వీణా జాంకర్, ఓంకార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
కథకు తగ్గట్టుగా రూపొందించిన స్క్రీన్‌ప్లే, టేకింగ్ మరియు గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆద్యంతం సస్పెన్స్ కలిగిస్తాయి. ఈ సిరీస్ మొత్తం దేవుడి పేరుతో జరిగే హత్యలు, గ్రామ ఆచారాలు మరియు వాటి మధ్య చిక్కుకుపోయే పోలీస్ అధికారి చుట్టూనే సాగుతుంది.. ఈ క్రమంలో పోలీస్ చేసే లోతైన ఇన్వెస్టిగేషన్ కథలో మరింత ఆసక్తిని పెంచుతుంది.
ఇంతకీ హత్యలు చేసే నిజమైన హంతకులు ఎవరు? మూఢనమ్మకాల్లో చిక్కుకున్న సమస్యను పోలీస్ ఎలా పరిష్కరించారు? “శంకాసుర్” కథ వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే దేవ్‌ఖేల్ వెబ్ సిరీస్ తప్పక చూడాల్సిందే. సుమారు 25 నిమిషాల రన్‌టైమ్‌తో, మొత్తం 7 ఎపిసోడ్స్తో ఈ సిరీస్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
కథేంటంటే:
మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో దేవతలి అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి ఒక శాపం ఉంది. ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమి రోజు రాత్రి ఆ ఊళ్లో ఒకరు చనిపోతుంటారు. దానికి కారణం.. దేవతల కాలంలో శంకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర్నించి వేదాలు దొంగిలిస్తాడు. అప్పుడు విష్ణువు మత్స్యావతారంలో వెళ్లి అతన్ని ఓడిస్తాడు.
తన తప్పు తెలుసుకున్న శంకాసురుడు అప్పటినుంచి సంవత్సరంలో ఎక్కువ తప్పులు చేసిన ఒక వ్యక్తిని హోలీ రోజు చంపేస్తాడనే కథ ప్రచారంలో ఉంది. అయితే.. ఈసారి మాత్రం ఊళ్లో ఒక మంచి వ్యక్తి చనిపోతాడు.
ఆ ఊరికి ఇన్‌స్పెక్టర్‌గా వెళ్లిన విశ్వాస్ (అంకుష్ చౌదరి) ఈ హత్య వెనుక ఎవరో ఉన్నారని బలంగా నమ్ముతాడు. కచ్చితంగా మనుషులే హత్య చేశారని వాదిస్తాడు. కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ.
డైరెక్టర్ చంద్రకాంత్ లతా గైక్వాడ్ కథను మైథాలజీ టచ్‌తో ఎంతో గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు. అంకుష్ చౌదరి ప్రధాన పాత్రలో అద్భుతంగా నటించారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బలంగా ఉంది. స్క్రీన్‌ప్లే చాలా బలంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. ఓవరాల్గా, మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌ను క్రైమ్ థ్రిల్లర్‌తో గ్రిప్పింగ్గా తెరకెక్కించడం ఈ సిరీస్ ప్రత్యేకత.
