పట్నం రుక్కమ్మ దశదిన కర్మలో సీఎం రేవంత్

పట్నం రుక్కమ్మ దశదిన కర్మలో సీఎం రేవంత్

చేవెళ్ల, వెలుగు: శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తల్లి పట్నం రుక్కమ్మ దశదిన కర్మలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆదివారం మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని జేపీఎల్ కన్వెన్షన్‌‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన సీఎం.. రుక్కమ్మ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్నం సోదరులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి కూడా రుక్కమ్మకు నివాళులర్పించి పట్నం కుటుంబ సభ్యులను పరామర్శించారు.