తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే లష్కర్ బోనాల వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. రంగురంగులతో విభిన్నంగా తీర్చిదిద్దిన బోనాలు చూపరులను ఆకట్టుకున్నాయి. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఉజ్జయిని మహంకాళి ఆలయ పరిసరాలు మార్మోగాయి.
సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకోగా, ఆలయం భక్తజన సంద్రంగా మారింది. ‘జై మహంకాళి’ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి.-
సిటీ ఫొటోగ్రాఫర్, వెలుగు
