లగ్జరీ విల్లాస్ రాజధానిగా హైదరాబాద్

లగ్జరీ విల్లాస్ రాజధానిగా హైదరాబాద్
  • ఈ ఏడాది రూ.10 కోట్లు, ఆపై రేట్లున్న 625 విల్లాల అమ్మకం
  • రూ.8,562 కోట్లతో సౌత్​లో టాప్​ ప్లేస్​
  • బెంగళూరులో 125, చెన్నైలో 58 ఇండ్లకే పరిమితం
  • ఇండియా ఎస్ఐఆర్.. సీఆర్ఈ మెట్రిక్స్ నివేదిక

హైదరాబాద్, వెలుగు: సౌత్​ ఇండియాలో లగ్జరీ ఇండ్ల రాజధానిగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ హవా కొనసాగుతోంది. టాప్​ అల్ట్రా- లగ్జరీ హౌసింగ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌కు భాగ్యనగరం కేరాఫ్​అడ్రస్​గా మారింది. రూ.10 కోట్లు, ఆపై రేట్లుండే ఇండిపెండెంట్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు, అల్ట్రా- లగ్జరీ హౌస్‌‌‌‌‌‌‌‌లు, స్కై విల్లాలు, హై-రైజ్ లగ్జరీ అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లను ఇక్కడ ఎక్కువగా కొంటున్నారు. విశాలమైన జాగలో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రేటర్​ హైదరాబాద్​లో నిర్మిస్తున్న విల్లాలకు డిమాండ్​అంతకంతకూ పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి.

హైదరాబాద్​లో ఈ ఏడాది ఇప్పటివరకు రూ.8,562 కోట్ల విలువైన 625 విల్లాలు అమ్ముడుపోయాయి. ఇదే సమయంలో బెంగళూరు 125, చెన్నై 58 ఇండ్లకే పరిమితమయ్యాయి. గతంతో పోల్చితే హైదరాబాద్​లో 55% పెరుగుదల నమోదవడం విశేషం. ఇండియా సోథెబీస్ ఇంటర్నేషనల్ రియాల్టీ(ఇండియా ఎస్ఐఆర్), సీఆర్ఈ మ్యాట్రిక్స్ తాజా రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

స్థలానికే అధిక ప్రాధాన్యత

రూ.10 కోట్లకు పైబడిన లగ్జరీ హౌసింగ్ విభాగంలో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ మార్కెట్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. తాజా నివేదికల ప్రకారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో రూ.10 కోట్లు ఖర్చు పెడితే సగటున 6,210 చదరపు అడుగుల విల్లా లభిస్తోంది. ఇంతే డబ్బుకు బెంగళూరులో 3,930, చెన్నైలో 4,290 చదరపు అడుగుల జాగ మాత్రమే వస్తోంది. అందుకే కొనుగోలుదారులను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఆకర్షిస్తున్నట్లు ఎక్స్​పర్ట్స్​ చెప్తున్నారు.

ఇక్కడ అమ్ముడైన ఇళ్లలో 8 వేల చదరపు అడుగుల కంటే పెద్ద నివాసాలు ఏకంగా 57%  ఉన్నాయి. ఈ విభాగంలోనే 355 యూనిట్లు అమ్ముడయ్యాయి. బెంగళూరుతో పోలిస్తే దాదాపు 58% ఎక్కువ స్థలం లభిస్తుండడం వల్లే విలాసవంతమైన విల్లాలు కొనాలనుకునేవారికి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ గమ్యస్థానంగా మారినట్లు తెలుస్తోంది. ఐటీ కంపెనీల విస్తరణ వల్ల నియోపోలిస్, కోకాపేట్ వంటి ఏరియాల్లో ఎన్నారైలు ఇలాంటి విల్లాల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నట్లు చెప్తున్నారు.

బెంగళూరుతో పోలిస్తే తక్కువ ట్రాఫిక్​, చెన్నైతో పోలిస్తే వాతావరణ అనుకూలతలు ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. దీనికితోడు ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) కనెక్టివిటీ, అంతర్జాతీయ విమానాశ్రయానికి వేగవంతమైన ప్రయాణం విల్లా సంస్కృతికి పెద్ద ప్లస్​ పాయింట్ అయినట్లు పేర్కొంటున్నారు.

ఏటా టాప్​గేర్​లో.. 

దక్షిణ భారతదేశంలో విలాసవంతమైన గృహాల విక్రయాల్లో హైదరాబాద్ ఏటా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నది. ఈ శ్రేణిలో బెంగళూరు, చెన్నైని దాటేసి మార్కెట్​ను కొత్త పుంతలు తొక్కిస్తున్నది. నాలుగేండ్లలో ఈ తరహా విక్రయాలు రూ.2,447 కోట్ల నుంచి రూ.8,562 కోట్లకు పెరిగి 3.5 రెట్ల వృద్ధిని నమోదు చేసింది. బెంగళూరు కంటే ఐదు రెట్లు, చెన్నై కంటే 11 రెట్లు ఎక్కువ యూనిట్లను విక్రయించడం విశేషం.

కోకాపేటలో రూ.1,298 కోట్లతో 111 యూనిట్ల అమ్మకం

హైదరాబాద్​లో అత్యధికంగా నార్త్​ వెస్ట్​, సౌత్​ వెస్ట్​ ప్రాంతాలలో లగ్జరీ విల్లాలు, రో హౌస్‌‌‌‌‌‌‌‌ల విక్రయాలు జరిగాయి. కోకాపేట్, గండిపేట వంటి ఖరీదైన ప్లేస్​లోనే రూ.1,298 కోట్లతో 111 యూనిట్లను విక్రయించారు. బెంగళూరులోని లగ్జరీ మైక్రో-మార్కెట్ ఏరియాలో ఇక్కడే ఎక్కువ బిజినెస్​ జరిగింది. ఆ తర్వాత వరుసగా మంచిరేవులలో రూ.1,111 కోట్లతో 67 యూనిట్లు, నానక్​రామ్‌‌‌‌‌‌‌‌ గూడలో రూ.973 కోట్లతో 81 యూనిట్లు, కూకట్‌‌‌‌‌‌‌‌పల్లిలో రూ.769 కోట్లతో 35 యూనిట్లు, ఖాజాగూడలో రూ.672 కోట్లతో 49 యూనిట్లు, పుప్పలగూడలో రూ.429 కోట్లతో 35 యూనిట్లు, ఇబ్రహీం బాగ్‌‌‌‌‌‌‌‌లో రూ.425 కోట్లు 38 యూనిట్లు విక్రయించినట్లుగా సౌత్​ బేస్, సీఆర్ఈ మ్రాట్రిక్స్​ రిపోర్ట్​ వెల్లడించింది.

గడిచిన ఐదేళ్ల యూనిట్‌‌‌‌‌‌‌‌ అమ్మకాల రిపోర్ట్​

సిటీ  పేరు    2022    2023    2024    2025    2026
హైదరాబాద్     173    406    467    570    625
బెంగుళూరు    27    36    57    84    125
చెన్నై    08    11    27    40    58