ఎలన్ మస్క్.. హింట్ ఇచ్చాడు. సెల్ ఫోన్ల తయారీలోకి వస్తున్నట్లు.. అవును.. స్టార్ లింక్ పేరుతో మొబైల్ ఫోన్లను తీసుకురానున్నట్లు చెబుతున్నాడు ఎలన్ మస్క్. శాటిలైట్ రంగంలో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఎలన్ మస్క్.. డైరెక్ట్ శాటిలైట్ నుంచి ఇంటర్నెట్ ఇస్తున్నాడు. స్టార్ లింక్ పేరుతో వైర్ లైస్ ఇంటర్నెట్ ఉండనే ఉంది.. స్టార్ లింక్ ను మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో.. స్టార్ లింక్ మొబైల్ ఫోన్లు తీసుకురాబోతున్నట్లు హింట్ ఇచ్చాడు ఎలన్ మస్క్.
ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ స్మార్ట్‌ఫోన్లపై మరోసారి పుకార్లు ఊపందుకున్నాయి. త్వరలో స్టార్‌లింక్ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చే అవకాశముందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఫోన్లు AI ఫీచర్లుతో పాటు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్‌కు డైరెక్ట్ కనెక్షన్ తో పనిచేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
స్టార్‌లింక్ స్మార్ట్‌ఫోన్లపై ఎలన్ మస్క్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ..స్టార్‌లింక్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, పనిచేసే విధానం గురించి పరోక్షంగా ప్రస్తావించడం చర్చకు దారి తీసింది.
►ALSO READ | కిలో వెండి 2 లక్షల 65 వేల రూపాయలే.. 2 రోజుల్లో లక్షా 36 వేలు తగ్గింది..!
తన పోస్టులో ఎలన్ మస్క్ ఇలా చెప్పాడు. స్టార్‌లింక్ ఫోన్లు సాధారణ స్మార్ట్‌ఫోన్లు కావని, ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అత్యంత అధునాతన పనితీరును అందిస్తాయని తెలిపారు. అంతేకాదు, ఈ డివైజ్‌లలో పవర్‌ఫుల్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్లు (NPU) ప్రాసెసర్లు ఉండనున్నట్లు సూచించారు.
ఈ NPU ప్రాసెసర్లు AI, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వంటి క్లిష్టమైన పనులను అత్యంత వేగంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన మైక్రోప్రాసెసర్లు. దీంతో భవిష్యత్‌లో స్మార్ట్‌ఫోన్ల పనితీరులో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశముందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
స్టార్‌లింక్ స్మార్ట్‌ఫోన్లు నిజంగా మార్కెట్‌లోకి వస్తే, ఇంటర్నెట్ కనెక్టివిటీ, AI వినియోగం, మొబైల్ టెక్నాలజీ రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
