ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి (Raghunath Reddy) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన తెలుగులో మాత్రమే కాకుండా, హిందీ, తమిళ్, బోజ్పురి భాషల్లో 370కి పైగా సినిమాలు, సీరియళ్లలో కీలక పాత్రలు పోషించి సినిమా పరిశ్రమలో విశేష గుర్తింపు పొందారు. రఘునాథ్ రెడ్డి మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అయితే, నెల రోజులక్రితమే ఆయన కొడుకు గుండె పోటుతో మరణించడం వల్ల అదే బెంగతో మరణించారని సినీ వర్గాల సమాచారం.
రఘునాథ్ రెడ్డి స్వస్థలం విజయవాడ. ఆయన భార్య అన్నపూర్ణ. వీరికి ముగ్గురు పిల్లలు సుధా లక్ష్మి, అరుణ, సుధాకర్. అయితే, ఇక ఒక్కగాని ఒక్క కొడుకు మరణించడంతో, అది తట్టుకోలేకపోయిన రఘునాథ్ రెడ్డి మానసికంగా కుంగిపోయారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రఘునాథ్ రెడ్డి కూడా గుండెపోటుతో కన్నుమూశారని సమాచారం.
►ALSO READ | Ram Charan: వాళ్లే మన జీవితంలో అసలైన బలం.. స్పెషల్ ఫొటోలతో రామ్ చరణ్ పోస్ట్..
రఘునాథ్ రెడ్డి సినిమాల విషయానికి వస్తే.. 1991లో పరుచూరి సోదరులు దర్శకత్వం వహించిన శోభన్ బాబు సినిమా సర్పయాగం సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత రఘునాథ్ రెడ్డి సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటించి మెప్పించారు. పెళ్ళి పందిరి, ఒరేయ్ రిక్షా, కలెక్టర్ గారు, ప్రేమించుకుందాం రా, ఆజాద్, ఛలో అసెంబ్లీ, దేవీ పుత్రుడు, సుబ్రహ్మణ్యపురం, శ్రీరామ రాజ్యం, వస్తాడు నా రాజు, గాయం 2, మిస్టర్ గిరీశం, నేరము - శిక్ష, సైనికుడు, సంక్రాంతి వంటి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షుకులకు సుపరిచితమయ్యారు.
