Ram Charan: వాళ్లే మన జీవితంలో అసలైన బలం.. స్పెషల్‌ ఫొటోలతో రామ్ చరణ్ పోస్ట్..

Ram Charan: వాళ్లే మన జీవితంలో అసలైన బలం.. స్పెషల్‌ ఫొటోలతో రామ్ చరణ్ పోస్ట్..

రామ్ చరణ్-ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. శనివారం (జనవరి 31న) ఈ మెగా దంపతులు ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయికి జన్మనిచ్చారు. ఈ బ్లాక్ బస్టర్ గుడ్ న్యూస్తో మెగా ఫ్యామిలీ, ఫుల్ హ్యాపీ మోడ్లో ఉంది.

ఈ సందర్భంగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో ప్రత్యేక ఫొటోలను పంచుకుంటూ తన ఆనందాన్ని తెలియాజేశారు. తన భార్య ఉపాసనతో కలిసి ఇంతకుముందు దిగిన స్పెషల్ ఫొటోలను షేర్ చేస్తూ, వాటికీ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జోడించారు.

రామ్ చరణ్ తన పోస్ట్‌లో,“మాకు పండంటి బాబు, పాప జన్మించిన శుభవార్తను పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడిని  కుమారుడిని కలిగి ఉండటంతో మా ఫ్యామిలీ సంపూర్ణతను పొందింది. మాకు అపారమైన ఆనందాన్ని, కృతజ్ఞతను కలిగిస్తోంది. మన జీవితంలో మహిళలే అత్యంత బలం మరియు ప్రేరణ. ఈ సంతోషకరమైన సమయంలో మాకు తోడుగా నిలిచిన అభిమానులు, కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము’’ అని రామ్ చరణ్‌ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఈ దంపతులకు ఇప్పటికే కుమార్తె క్లీంకార ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కవలల రాకతో వారి కుటుంబం మరింత సంపూర్ణమైంది. ప్రస్తుతం రామ్ చరణ్ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్గా మారాయి. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్తో పాటుగా సినీ ప్రముఖులు రామ్ చరణ్–ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

►ALSO READ | Devkhel Review: దేవుడి పేరుతో వరుస హత్యలు.. ఓటీటీలో ఉత్కంఠ రేపుతున్న క్రైమ్ థ్రిల్లర్

చిరంజీవి ఇప్పటికే, సోషల్ మీడియా ద్వారా, మీడియా మీట్లో స్పందించి తన ఆనందాన్ని పంచుకున్నారు. మెగా వారసులు రావడంతో తమ ఆనందానికి అవధులు లేవని ఆయన తెలిపారు. “ఆ భగవంతుడి దయ, హనుమాన్ కృపతో ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ జన్మించారు. ఉపాసనతో పాటు ఇద్దరు పిల్లలు కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. మా ఇంట ఈ శుభం జరగాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని చిరు మీడియా వేదికగా తెలిపారు. 

మెగా ఫ్యామిలీ జోష్.. 

2012లో వివాహం చేసుకున్న రామ్ చరణ్, ఉపాసన జంటకు, దాదాపు 11 ఏళ్ల తర్వాత 2023 జూన్‌లో క్లీంకార జన్మించింది. ఇప్పుడు క్లీంకారకు తోడుగా తమ్ముడు లేదా చెల్లె రావడంతో ఫ్యామిలీ 'మెగా సంబరాలు' మొదలుపెట్టేశారు. ఇటీవల చిరంజీవి నటించిన 'మన శంకర్ వరప్రసాద్' బాక్సాఫీప్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తూ భారీగా వసూళ్లు రాబట్టింది. మెగాస్టార్ తన వింటేజ్ మేజిక్‌ను పునరావృతం చేసి కెరీర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టడం, మరో వైపు మెగా కోడలు కవలలకు జన్మనివ్వడం, త్వరలో భారీ అంచనాలతో పెద్ది వస్తుండటం మెగా ఫ్యాన్స్ లో జోష్ ని పెంచుతున్నాయి.