ఏపీ పాలిటిక్స్ లో తిరుమల లడ్డు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవలే తిరుమల లడ్డూ కేసుకు సంబంధించిన ఫైనల్ చార్జిషీట్ లో లడ్డూ ప్రసాదం కోసం వాడిన నెయ్యిలో జంతు కొవ్వు లేదని, సింథటిక్ నెయ్యి వాడారని తెల్పింది సీబీఐ సిట్. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో తిరుమల లడ్డు అంశంపై స్పందించిన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ ఉందని NDDB రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడానని అన్నారు.
నెయ్యిలో జంతు కొవ్వు కలిపారని ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందంటూ నేను చెప్పగానే గింజుకున్నారని.. నానా యాగి చేసి సుప్రీంకోర్టుకు వెళ్లారని అన్నారు చంద్రబాబు.తప్పు జరిగిందని ఒక అడ్మినిస్ట్రేటర్ గా నేను దానిపై సిట్ విచారణకు ఆదేశిస్తే... ఇప్పుడు నేను క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు.
వెంకటేశ్వర స్వామి తన కుల దైవమని.. తాను ఆరాధించే దేవుడని అన్నారు. ఇప్పటికే తాను మహా ద్వారం ద్వరా దర్శనానికి వెళ్లానని..సీఎంగా ఉన్నప్పటికీ సామాన్య భక్తుడిలానే క్యూ లైన్ లో వెళ్లి దర్శనం చేసుకుని ఆయన సేవ చేసుకుంటానని అన్నారు. ఒక అపచారం చేసి, ఒక మహా పాపం చేసి కప్పిపుచ్చుకోవడానికి తిరిగి ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు.
►ALSO READ | మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నిప్పు... రాళ్లు కర్రలతో టీడీపీ కార్యకర్తల దాడి..
వైసీపీ నేతలు వెంకటేశ్వర స్వామిని బజారుకు ఈడ్చాలని అనుకుంటున్నారని..తాను ఆ పని చేయనని అన్నారు చంద్రబాబు. వెంకటేశ్వర స్వామికి పవర్స్ ఉన్నాయని.. ఆయన్ని కాపాడుకోవడమే కాకుండా మనల్ని కూడా కాపాడుతాడని అన్నారు చంద్రబాబు. ఏ సమస్య అయిన సరే పరిష్కార మార్గం స్వామీవారే చూపిస్తారని... ఆయనే దారి చూపిస్తాడని అన్నారు.
వెంకటేశ్వర స్వామి తో పెట్టుకుంటే వచ్చే జన్మలో కాకుండా ఈ జన్మలోనే శిక్ష పడుతుందని.. అది తన నమ్మకమని అన్నారు చంద్రబాబు. ఎవరితో అయినా పెట్టుకోండి కానీ..వెంకటేశ్వర స్వామి తో పెట్టుకుని రాజకీయాలు చేయకండని హెచ్చరించారు చంద్రబాబు.
