48కి 48 గెలవాలి.. సీఎం రేవంత్‎ను అడిగి ఎన్ని నిధులైనా తెస్తా: మంత్రి కోమటిరెడ్డి

48కి 48  గెలవాలి.. సీఎం రేవంత్‎ను అడిగి ఎన్ని నిధులైనా తెస్తా: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‎లో 48 స్థానాలకు 48 స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం (ఫిబ్రవరి 1) నల్లగొండ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులతో మంత్రి కోమటిరెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున బీసీలకు 70శాతం సీట్లు కేటాయించామని.. ఇది రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. 

మీరు ఎన్నికల్లో గెలిచి రండి.. అభివృద్ధి నాకు వదిలివేయడంన్నారు. నల్లగొండ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి ఎన్ని నిధులు అయినా తెస్తానని చెప్పారు. ప్రజల దగ్గరికి ఓట్ల కోసం ఎట్లా పోతామో.. వారి మంచి చెడులో కూడా అంతే భాగస్వామ్యం కావాలని సూచించారు. 30ఏళ్లుగా నా నల్లగొండ ప్రజలకు నేనేంటో తెలుసన్నారు. భవిష్యత్‎లో వేల కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని.. ప్రతి ఓటరును కలిసి వారికి భరోసా ఇవ్వాలని సూచించారు. అధికార పార్టీ కార్పొరేటర్లు గెలిస్తే నా దగ్గరికి వచ్చి అభివృద్ది, సంక్షేమ పనులు చేసుకోవచ్చన్నారు.