పెనుబల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లె గురుకులంలో విద్యార్థినులను ఎలుకలు కరవడం కలకలం రేపింది. అడవిమల్లెలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల హాస్టల్‌లో నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థినులను ఎలుకలు కరిచాయి.
గాయపడిన స్టూడెంట్లను లంకాసాగర్ పీహెచ్‌సీకి తరలించారు. డాక్టర్లు వారిని పరీక్షించి ర్యాట్ బైట్ యాంటీ వ్యాక్సిన్ డోస్ ఇచ్చారు. గతంలోనూ హాస్టల్‌లో ఎలుకలు కరిచాయని విద్యార్థినులు వాపోతున్నారు. ఎలుకల భయంతో రాత్రి భయంతో గడపాల్సి వస్తోందన్నారు.
