మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఎన్నికల స్టంట్ అని ఎంపీ డీకే.అరుణ ఆరోపించారు. శుక్రవారం మహబూబ్నగర్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ప్రజలను మోసం చేసేందుకు ఏదో ఒకటి తెరపైకి తేవడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అండర్స్టాండింగ్ఉందన్నారు. మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఆ పార్టీలు చేసిందేమీ లేదని పేర్కొన్నారు. మేయర్ గా బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టండి
మక్తల్(నారాయణపేట): మున్సిపల్ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని ఎంపీ డీకే.అరుణ కోరారు. శుక్రవారం నారాయణపేట పట్టణంలో పార్టీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, రతంగ్ పాండు రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, ఇన్చార్జి శ్రీకాంత్ తో కలిసి ప్రెస్మీట్ నిర్వహించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులతో మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలోస్టేడియం అభివృద్ధికి రూ.20 కోట్లు ఇస్తామని ప్రకటించి చిల్లి గవ్వ ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మంత్రి శ్రీహరి రూ.30 కోట్లు ఇస్తామంటున్నారని.. నమ్మడం ఎలాగని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే నిధులేంటో తాము చెప్పుకుంటాం.. దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల లెక్కలు మీరు చెప్పి ఓట్లడగాలని కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు.
