IND vs NZ: మతిమరుపుతో స్టేడియాన్ని కంగారెత్తించిన సూర్య.. అసలేం జరిగిందంటే..?

IND vs NZ: మతిమరుపుతో స్టేడియాన్ని కంగారెత్తించిన సూర్య.. అసలేం జరిగిందంటే..?

న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదో టీ20లో సూర్య కుమార్ యాదవ్ టాస్ సమయంలో చేసిన పని వైరల్ అవుతోంది. శనివారం (జనవరి 31) తిరువనంతపురం వేదికగా గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఇండియా మూడు మార్పులతో బరిలోకి  దిగింది. అయితే మూడు మార్పులేంటో సూర్య చెప్పలేకపోయాడు. ఇషాన్ కిషాన్, అక్షర్ పటేల్ ప్లేయింగ్ 11 లోకి వచ్చారని చెప్పిన సూర్య.. మూడో మార్పు చెప్పలేకపోయాడు. దీంతో స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ కంగారు పడిపోయారు. 

తిరువనంతపురం శాంసన్ కు హోమ్ గ్రౌండ్. సొంతగడ్డపై శాంసన్ ఆట చూడడానికి చాలామంది ఫ్యాన్స్ వచ్చారు. సూర్య ఒక పేరు మర్చిపోవడంతో తిరువనంతపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫ్యాన్స్ సంజు శాంసన్ అని కంగారు పడ్డారు. అయితే సూర్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెబుతూ సంజు శాంసన్ ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడని చెప్పి స్టేడియంలో ఫ్యాన్స్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ప్లేయింగ్ 11లో ఇషాన్ కిషాన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ 11లో వచ్చారు. హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ బెంచ్ కు పరిమితమయ్యారు. సొంతగడ్డపై శాంసన్ మరోసారి విఫలమయ్యాడు.

►ALSO READ | IND vs NZ: చివరి టీ20లో టీమిండియా బ్యాటింగ్.. ప్లేయింగ్ 11లో భారీ మార్పులతో సూర్య సేన   

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇండియా  పవర్ ప్లే లో 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి విఫలమయ్యాడు. కేవలం 6 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఉన్నంత సేపు వేగంగా ఆడిన అభిషేక్ శర్మ 16 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం కెప్టెన్ సూర్య (5), ఇషాన్ కిషన్ (13) క్రీజ్ లో ఉన్నారు. న్యూజీలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్ కు రెండు వికెట్లు దక్కాయి.        

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI):

టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, బెవాన్ జాకబ్స్, మిచెల్ సాంట్నర్(c), కైల్ జామిసన్, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ

ఇండియా (ప్లేయింగ్ XI):

అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా