ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మరికొన్ని గంటల్లో చివరిదైన ఐదో టీ20 జరగనుంది. శనివారం (జనవరి 31) తిరువనంతపురం వేదికగా గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఐదుగురు ప్రధాన బౌలర్లతో బరిలోకి దిగి చేసిన ప్రయోగం బెడిసి కొట్టడంతో.. టీమిండియా నాలుగో మ్యాచ్‌లో ఓడింది. ఫలితంగా సిరీస్‌లో ఆధిక్యం 3–1కి తగ్గింది. దాంతో ఈ మ్యాచ్‌పై హోమ్ టీమ్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. బ్యాటింగ్‌లో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేకపోయినా.. ఓపెనింగ్‌లో సంజూ శాంసన్ ఫామ్‌పై ఆందోళన నెలకొంది. ఈ మ్యాచ్ లో శాంసన్ తన సొంతగడ్డపై ఆడనుండడం విశేషం.
మ్యాచ్ కు ఒకరోజు ముందు భారత జట్టు తిరువనంతపురం చేరుకుంది. ఎయిర్ పోర్ట్ లో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ చేసిన ఒక పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో సంజు సామ్సన్ కు టీమిండియా కెప్టెన్ నెక్స్ట్ లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. ఈ వీడియో లో సూర్య వెనుక శాంసన్ నడుస్తూ వస్తున్నాడు. సంజు కు సొంతగడ్డ కావడంతో సూర్యకుమార్ "దయచేసి దారి ఇవ్వండి, చెట్టాను ఇబ్బంది పెట్టవద్దు" అని అక్కడ ఉన్న వారితో చెప్పాడు. సూర్య చేసిన హడావుడికి శాంసన్ పగలబడి నవ్వాడు. చాలా ఫన్నీగా సాగిన ఈ సీన్ సోషల్ మీడియాలో నెటిజన్స్ ను నవ్విస్తుంది.
►ALSO READ | ఆస్ట్రేలియాకు బిగ్ షాక్: 2026 T20 ప్రపంచ కప్ నుంచి పాట్ కమ్మిన్స్ ఔట్
ఇక సంజు శాంసన్ విషయానికి వస్తే తన పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో తనకు ఇష్టమైన ఓపెనింగ్ ప్లేస్ అప్పగించినప్పటికీ శాంసన్ తాను ఆడిన తొలి 3 మ్యాచ్‌ల్లో 16 రన్స్ మాత్రమే చేసి నిరాశపరిచాడు. తిలక్ వర్మ గాయం కారణంగా ప్రతి మ్యాచ్ లో ఆడే అవకాశం వచ్చినా ఉపయోగిచుకోవడంలో విఫలమయ్యాడు. బుధవారం (జనవరి 28) కివీస్ తో జరిగిన నాలుగో టీ20లో 24 పరుగులు చేయి మరోసారి నిరాశపరిచాడు. ఓవరాల్ గా నాలుగు మ్యాచ్ ల్లో 40 పరుగులే చేసి ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. మరి సొంతగడ్డపై జరగనున్న చివరి టీ20లో భారీ ఇన్నింగ్స్ ఆడి శాంసన్ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.
Make way for @IamSanjuSamson in 𝗚𝗼𝗱'𝘀 𝗼𝘄𝗻 𝗰𝗼𝘂𝗻𝘁𝗿𝘆 😉
— BCCI (@BCCI) January 30, 2026
🎥 Don't miss this banter between friends Sanju Samson and Captain Surya Kumar Yadav 😄#TeamIndia | #INDvNZ | @IDFCFirstBank | @surya_14kumar pic.twitter.com/zBAFPmZJGk
