డ్యాన్సింగ్ ట్రాఫిక్ పోలీస్ అంటే గుర్తుపట్టని వాళ్లు ఎవరూ ఉండరేమో. ఫుల్ ట్రాఫిక్ ఉన్నా కూడా ఎలాంటి స్ట్రెస్ తీసుకోకుండా తనదైన స్టైల్ లో.. డ్యాన్సింగ్ మూమెంట్స్ తో డ్యూటీ చేసి.. నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి పోలీస్ ను ప్రస్తుతం బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా ఈ న్యూస్ వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రంజీత్ సింగ్ అనే ట్రాఫిక్ పోలీస్ కు డ్యాన్సింగ్ కాప్.. అనే పేరుంది. ఇండోర్ లో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రంజీత్ సింగ్ ను.. డిమోట్ చేసి కానిస్టేబుల్ ర్యాంకు కు పరిమితం చేశారు. ట్రాఫిక్ పోలీస్ డిపార్టుమెంట్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయన గురించి తెలిసిన వారు.. షాకింగ్ కు గురవుతున్నారు.
ముంబైకి చెందిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ఆయనను డిమోట్ చేశారు. ఫీల్డ్ డ్యూటీ నుంచి తప్పించి రిజర్వ్ లైన్ కు ట్రాన్స్ ఫర్ చేశారు.
తనతో అసభ్యకర పద్ధతిలో చాటింగ్ చేసినట్లు ఆరోపనలు చేసింది ఆ సదరు ముంబై మహిళ. తనను ఇండోర్ లో ప్రైవేట్ గా కలవాల్సిందిగా అడిగినట్లు కంప్లైంట్ చేసింది. మహిళ ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న డిపార్ట్ మెంట్.. తదుపరి విచారణ ముగిసే వరకు ఆయనను రిజర్వ్ లైన్ లోనే కొనసాగించనున్నారు. దీంతో దర్యాప్తు పూర్తయ్యే వరకు డ్యాన్సింగ్ మూమెంట్స్ కు అవకాశం లేదనే చెప్పాలి.
►ALSO READ | "దేవుడా.. 400 మీటర్ల దూరానికి 18 వేల బిల్లు! అమెరికా మహిళని మోసం చేసిన టాక్సీ డ్రైవర్ అరెస్ట్..
బాధ, కోపం నుంచి బయటపడటంతో పాటు ప్రయాణికులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించేందుకే తను అలాంటి మూమెంట్స్ ఇస్తూ డ్యూటీ చేసినట్లు రంజీత్ చెప్పేవాడు. ట్రాఫిక్ నియంత్రణ అంటే భారమైన డ్యూటీ అనుకోకుండా కోపాన్ని, బాధను, ఒత్తిడిని తగ్గించేందుకు సరైన పద్ధతిగా ట్రాఫిక్ విభాగాలు గుర్తించాయి. తన25 సంవత్సరాల కెరీర్‌లో 150 కి పైగా అవార్డులు, రివార్డులు పొందినట్లు చెప్పాడు. ప్రస్తుతం మహిళ ఆరోపణలతో డిమోట్ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఆరోపణలను ఖండించిన రంజీత్..
మహిళ ఆరోపణలను డ్యాన్సింగ్ కాప్ రంజీత్ ఖండించాడు. నేను కష్టపడి పని చేసి గౌరవం సంపాదించాను.. కాబట్టి ఈ రోజు నాకు మీ మద్దతు అవసరం. నా ఇమేజ్‌ను చెడగొట్టే పని ఎవరూ చేయలేరు. నన్ను నెగెటివ్ గా చిత్రీకరిస్తున్న వారికి కూడా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అసూయపడటానికి సంకోచించకండి, కానీ ఎవరి ఇమేజ్‌ను దెబ్బతీయకండి.. అంటూ ఇటీవలే ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.
