Singer Mangli: చేతులెత్తి క్షమాపణలు కోరుతున్నా.. 'KD' మూవీ సాంగ్ వివాదంపై మంగ్లీ ఎమోషనల్ పోస్ట్!

Singer Mangli: చేతులెత్తి క్షమాపణలు కోరుతున్నా.. 'KD' మూవీ సాంగ్ వివాదంపై మంగ్లీ ఎమోషనల్ పోస్ట్!

కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా కథానాయకుడిగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'KD: ది డెవిల్'. ఈ సినిమా చుట్టూ ఇప్పుడు ఒక ఊహించని వివాదం నెలకొంది. ఈ చిత్రంలోని 'సర్కే చునార్ తేరి సర్కే' అనే సాంగ్ లిరిక్స్ నెట్టింట పెను దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా హిందీ వర్షన్ పాటలోని కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో, మేకర్స్ వెంటనే స్పందించి ఆ పాటను యూట్యూబ్ నుండి తొలగించారు.

క్షమాపణలు కోరిన సింగర్ మంగ్లీ

ఈ వివాదంపై టాలీవుడ్ పాపులర్ సింగర్ మంగ్లీ  స్పందించారు. ఈ పాటను అన్ని భాషల్లోనూ ఆమే ఆలపించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేస్తూ.. జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పారు. "నేను ఎప్పుడూ ప్రజల మనోభావాలను గౌరవిస్తాను. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటు పట్ల నేను చాలా బాధపడుతున్నాను. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. ఈ పాటలోని వివాదాస్పద సాహిత్యాన్ని ఇప్పటికే మార్చారు. త్వరలోనే అప్‌డేట్ చేసిన కొత్త సాంగ్‌ను విడుదల చేస్తారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతానని హామీ ఇస్తున్నాను" అని మంగ్లీ పేర్కొన్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mangli 🎙️ (@iammangli)

 

అసలు వివాదం ఎక్కడ?

'KD: ది డెవిల్' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. అయితే మిగిలిన భాషల్లో లేని అభ్యంతరాలు కేవలం హిందీ వర్షన్ లిరిక్స్‌పైనే వచ్చాయి. ఆ పాటలోని కొన్ని పదాలు ద్వంద్వార్థాలు (Double Meaning) ఇచ్చేలా ఉండటంతో పాటు, కొంత అసభ్యత కనిపిస్తోందని ఉత్తరాది ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సినిమా ప్రతిష్ట దెబ్బతినకూడదనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ సాంగ్‌ను డిలీట్ చేసింది.

►ALSO READ | Taapsee Pannu : హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలంటే హీరోలకు భయం.. తాప్సీ పన్ను సంచలన వ్యాఖ్యలు.

నోరా ఫతేహీ వర్సెస్ మేకర్స్

ఈ వివాదంలో కేవలం మంగ్లీ మాత్రమే కాదు, ఈ పాటలో నటించిన బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా తన అసంతృప్తిని వెల్లడించారు. హిందీ డబ్బింగ్ సమయంలో తన అనుమతి తీసుకోలేదని, అందులోని సాహిత్యం అభ్యంతరకరంగా ఉందని ఆమె ఆరోపించారు. ఈ వివాదాల నేపథ్యంలో దర్శకుడు ప్రేమ్ అండ్ టీమ్ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)

 

కేంద్రం సీరియస్ యాక్షన్..

మరోవైపు ‘సర్కే చునరి’ పాటపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది.  ఈ సాంగ్ లో సాహిత్యం, దృశ్యాలు అసభ్యకరంగా ఉన్నాయని విమర్శల నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరణ ఇచ్చారు. ఈ పాటను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి వాటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.  ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఒక్క పాటలోని లిరిక్స్ వల్ల పాన్ ఇండియా సినిమాపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 30, 2026న విడుదల కానుంది.