సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఒక్కక్కరు వేసే వేషాలు మామూలుగా ఉండవు. వీళ్లు బానే ఉన్నారా.. పిచ్చి పట్టిందా..? అని జనాలు నోరెళ్ల బెట్టేలా ఉంటున్నాయి షూట్స్. క్రియేటివిటీ అనాలో పిచ్చి పరాకాష్టకు చేరింది అనాలో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియాలో వీటిపై కామెంట్స్ వస్తున్నా అతి మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. లేటెస్ట్ గా ట్రెండ్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోపై సోషల్ మీడియాలో ఫుల్లుగా ట్రోలింగ్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ఒక జంట తెల్ల డ్రెస్ లు వేసుకుని నీటితో తేలియాడే వీడియో ఒకటి ట్రెండ్ అవుతోంది. ఇద్దరు బురద నీటిపై శవాల్లాగే తేలియాడుతుంటారు. కెమెరా మెన్ లు.. ఏదో వైల్డ్ లైఫ్ వీడియో తీస్తున్నట్లుగా ప్రయోగాలు చేస్తుంటారు. హర్రర్ సినిమాను చూపించిన రేంజ్ లో వీళ్ల యేషాలున్నాయని ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు.
విచిత్రంగా తయారైన ప్రీవెడ్డింగ్ షూట్స్ అనే పేరుతో ఈ వీడియోను ఒక యూజర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిపై ఫుల్లుగా ట్రోలింగ్ జరుగుతోంది. కొందరు పాజిటివ్ గా.. మరికొందరు నెగెటివ్ రిప్లైస్ ఇస్తున్నారు. కొందరు ఫోటోగ్రాఫర్లు ఇది రా ఎమోషన్.. ప్యూర్ సినిమా స్టైల్ లో ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
మీరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ నేర్చుకున్నట్లుంది.. కానీ చివరికి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అయిపోయారు.. అంటూ మరొక యూజర్ కామెంట్ పెట్టాడు. మరో యూజర్.. బడ్జెట్ ఏమో సింపుల్ ఫోటోషూట్ చేయాలని నిర్దేశిస్తే.. డైరెక్టర్ టైటానిక్ కు గగ్నమ్ స్టైల్ మిక్స్ చేసి.. నెక్స్ట్ లెవెల్ లో ఫోటోగ్రఫీ చేశారు. రీల్స్ కోసం 8k డ్రోన్స్ ఫిలిమ్ తీస్తుంటే.. ఆ జంట మాత్రం రొమ్యాంటిగ్ గా మునిగిపోతోంది.. అంటూ కామెంట్ చేస్తున్నారు.
ప్రీ షూట్స్ పేరున డబ్బులు వేస్ట్ చేసేదెందుకు.. ఏఐ ని అడిగితే మీకు నచ్చినట్లు అద్భుతంగా ఎడిట్ చేసి ఇస్తుందికదా..? అకి మరో నెటిజన్ పోస్ట్ చేశాడు. వాళ్లు నిజంగా పెళ్లి చేసుకుంటున్నారా..? లేక క్రైమ్ పెట్రోల్ నెక్స్ట్ సీజన్ కోసం చేస్తున్న ప్రయోగమా అంటూ మరో యూజర్ ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నాడు. మొత్తానికి వైరల్ కావాలని అనుకున్న వారి కోరిక తీరిందనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఇది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.
Pre Wedding Shoots are getting too weird 😂😂 pic.twitter.com/xhVKjoZrVy
— Rosy (@rose_k01) March 18, 2026
