"దేవుడా.. 400 మీటర్ల దూరానికి 18 వేల బిల్లు! అమెరికా మహిళని మోసం చేసిన టాక్సీ డ్రైవర్ అరెస్ట్..

"దేవుడా.. 400 మీటర్ల దూరానికి 18 వేల బిల్లు! అమెరికా మహిళని మోసం చేసిన టాక్సీ డ్రైవర్ అరెస్ట్..

ముంబై ఎయిర్ పోర్ట్  దగ్గర ఒక అమెరికా మహిళను మోసం చేసిన టాక్సీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం 400 మీటర్ల దూరంలో ఉన్న హోటల్‌కు తీసుకెళ్లడానికి ఆ డ్రైవర్ ఏకంగా రూ. 18 వేలు అంటే సుమారు 200 డాలర్లు వసూలు చేశాడు.

అసలేం జరిగిందంటే... జనవరి 12న అమెరికా నుంచి ఓ మహిళ ముంబై విమానాశ్రయానికి చేరుకుంది. ఆమె ఎయిర్‌పోర్ట్ పక్కనే ఉన్న ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్లాలి. కానీ డ్రైవర్ ఆమెను డైరెక్ట్  తీసుకెళ్లకుండా, సుమారు 20 నిమిషాల పాటు చుట్టూ తిప్పి,  చివరకు హోటల్ దగ్గర దింపి, భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేశాడు. ఆ సమయంలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. 

ALSO READ : హైదరాబాద్‌లోని ఆ భూములన్నింటికీ ప్రహరీగోడ నిర్మించాలి

దింతో ఆ  మహిళ జనవరి 26న తనకు జరిగిన చేదు అనుభవాన్ని Xలో షేర్ చేసింది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో ముంబై పోలీసులు వెంటనే స్పందించి హోటల్ వివరాలు, టాక్సీ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేసి, 50 ఏళ్ల దేశ్‌రాజ్ యాదవ్ అనే డ్రైవర్‌ను మూడు గంటల్లోనే పట్టుకున్నారు. అలాగే నిందితుడిని అరెస్ట్ చేసి, టాక్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఉన్న రెండో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మహిళ జనవరి 12న హోటల్‌లో చెక్ ఇన్ చేసి, తరువాత రోజు చెక్ అవుట్ చేసి పూణే మీదుగా అమెరికాకు తిరిగి వెళ్ళినట్లు తేలింది.