- ఎల్పీజీ కొరతతో రెడీటు కుక్, రెడీ టు ఈట్
- నూడుల్స్, బిర్యానీ కిట్లు, ఫ్రోజన్ స్నాక్స్ కు డిమాండ్
- దేశ వ్యాప్తంగా 20% పెరిగిన అమ్మకాలు
- 30% పెరిగిన ఇండక్షన్ స్టౌవ్ ల ధరలు
- దేశంలో కొత్త ఆహార సంస్కృతి ప్రారంభం
ఢిల్లీ: గ్యాస్ సిలిండర్ దొరకని పరిస్థితి దేశంలో కొత్త ఆహార సంస్కృతికి దారి తీస్తోంది. ఎల్పీజీ కొరతతో ఇంటి పంటలు తగ్గిపోతుండగా, రెడీ టుకుక్, రెడీటుఈట్ ఆహార పదార్థాలు ప్రజల ప్లేట్లలో స్థానం సంపాదిస్తున్నాయి. థాయ్ కర్రీ పేస్టులు, బిర్యానీ కిట్లు, ఫ్రోజన్ స్నాక్స్, ఇస్టం ట్ నూడుల్స్ వంటి ఉత్పత్తుల అమ్మకాలు ఒక్క సారిగా పెరిగి నెలనెలా 20 శాతం పెరిగాయి. తక్కువ గ్యాస్ వినియోగంతో త్వరగా తయా రయ్యే ఆహారాల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు.
ముఖ్యంగా రెడీ కర్రీ పేస్టులు, ప్యాకేజ్డ్ భోజన కిట్లు కొత్తగా ఆదరణ పొందుతున్నాయి. కంపెనీలు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని స్టాక్ పెంచడంతో పాటు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఫ్రోజన్ కూరగాయల ప్రకటనలను మళ్లీ ప్రారంభించగా, క్విక్ కామర్స్ ప్లాట్ ఫామ్ లు ఇండక్షన్కు సరిపోయే వంట సామగ్రిని ప్రమోట్ చేస్తున్నాయి. కరోనా సమయంలో పెరిగిన రెడీమేడ్ ఫుడ్ వినియోగం మళ్లీ ఊపందుకోవచ్చనే అంచనా ఉంది. ఇదే సమయంలో ఇండక్షన్ స్టౌవ్లు, ఎలక్ట్రిక్ కుకింగ్ ఉపకరణాల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. గ్యాస్ సంక్షోభం కొససాగితే దేశంలో ఆహార అలవాట్లు పూర్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
