హైదరాబాద్‌లోని ఆ భూములన్నింటికీ ప్రహరీగోడ నిర్మించాలి

హైదరాబాద్‌లోని ఆ భూములన్నింటికీ  ప్రహరీగోడ నిర్మించాలి

 హైదరాబాద్ లోని  రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డుకు ఉన్న భూములన్నింటికీ ప్రహరీ గోడలు నిర్మించాలని గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సెక్రటరీ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. 

జనవరి 31న  మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని  గాజులరామరం భౌరంపేట్ లలో  పర్యటించారు. రాజీవ్ స్వగృహ అపార్టుమెంట్ టవర్లు, ఓపెన్ ప్లాట్స్ , సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలోని భూములను, హౌసింగ్ బోర్డు కు చెందిన 16 ఎకరాల భూములను పరిశీలించారు గౌతమ్.  అవి అన్యాక్రంతం కాకుండా నిరంతరం పర్యవేక్షించాలని భూములు కబ్జా కాకుండా ప్రహరీ గోడలను నిర్మించాలని, సెక్యూరిటీ గార్డులను నియమించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. 

అనంతరం బాచుపల్లిలో  ఇటీవల హైడ్రా అధికారులు కాపాడిన భూములను కూడా ఆయన పరిశీలించారు.   మేడ్చల్ జిల్లాలోని డబుల్ బెడ్రూం కాలనీల్లో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు  గౌతమ్.