ముంబై: దివంగత నేత అజిత్ పవార్ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అజిత్ పవార్ మరణానికి కారణమైన బారామతి విమాన ప్రమాదం దర్యాప్తు చేయాలని కోరుతూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. అజిత్ పవార్ అల్లుడు రోహిత్ పవార్ అభ్యర్థన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
2026, జనవరి 28న విమాన ప్రమాదంలో అజిత్ పవార్ చనిపోయిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఆయన ప్రయాణించిన విమానం బారామతి ఎయిర్ స్ట్రిప్ లో కుప్పకూలింది. ఈ ఘటనలో దాదా స్పాట్ లోనే చనిపోయారు. అయితే.. అజిత్ పవార్ మరణంపై ఆయన మేనల్లుడు రోహిత్ పవార్ పలు అనుమానాలు వ్యక్తం చేశాడు.
ఈ ఘటన వెనక కుట్ర ఉందని.. సమగ్ర విచారణ జరపాలని సీఎం ఫడ్నవీస్‌కు లేఖ రాశాడు. అలాగే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసి అజిత్ పవార్ డెత్ అంశాన్ని లోక్ సభలో లేవనెత్తాలని కోరారు. ఈ క్రమంలో రోహిత్ పవార్ అభ్యర్థన మేరకు సీఎం ఫడ్నవీస్ కేంద్ర హోం శాఖకు లేఖ రాసి.. అజిత్ పవార్ మరణానికి కారణమైన బారామతి విమాన ప్రమాదం దర్యాప్తు చేయాలని కోరారు.
