ఏపీలో 10 వేల 60 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల

ఏపీలో 10 వేల 60 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ యువతకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. 10 వేల 60 పోస్టులతో ప్రభుత్వం ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం గమనార్హం.  స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో 3వేల 4 పోస్టులు, హోం శాఖలో 3వేల 57 పోస్టులు, హయ్యర్ ఎడ్యుకేషన్ 1500 ప్రొఫెసర్లు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో 452 పోస్టులు, వాటర్ రిసోర్సెస్ 224 ఏఈఈ పోస్టులు, ఫైనాన్స్ 169, అడవులు, పర్యావరణం 140 పోస్టులు, పంచాయితీ రాజ్ అండ్ ఆర్డీ 328 పోస్టులకు ప్రభుత్వం ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది.

వివిధ శాఖల్లో ఏర్పడే ఖాళీల సంఖ్య, నోటిఫికేషన్స్ తేదీలు, పరీక్షల తేదీలు, వాటి ఫలితాల తేదీలు తదితర వివరాలతో జాబ్ క్యాలెండర్ను రూపొందిస్తారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు వినగానే నిరుద్యోగులు కోచింగ్​సెంటర్లకు క్యూ కడుతున్నారు. వేలల్లో ఫీజులు కడుతూ ప్రిపేరవుతున్నారు. ఇలా ఇప్పటికే కొన్ని వేలల్లో డబ్బులు కోచింగ్​సెంటర్లకు చెల్లించిన నిరుద్యోగులు ఇప్పుడు తాజా ప్రకటనతో మళ్లీ కోచింగ్​సెంటర్ల బాట పడుతున్నారు.