నేషనల్ కబడ్డీ చాంపియన్ గా హర్యానా

నేషనల్  కబడ్డీ చాంపియన్ గా హర్యానా

హైదరాబాద్,  వెలుగు: సీనియర్ నేషనల్ విమెన్స్ కబడ్డీ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో హర్యానా జట్టు విజేతగా నిలిచింది. గచ్చిబౌలి ఇండోర్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో శుక్రవారం రాత్రి ఉత్కంఠగా సాగిన ఫైనల్లో హర్యానా  39–37తేడాతో డిఫెండింగ్ చాంప్  రైల్వేస్‌‌‌‌పై  విజయం సాధించి టైటిల్ నెగ్గింది. హర్యానా స్టార్ ప్లేయర్ నికిత 17 పాయింట్లతో రాణించగా..  రుచి (9) కూడా సత్తా చాటింది.  రైల్వేస్ తరఫున పూజ 11 పాయింట్లతో టాప్ స్కోరర్‌‌‌‌గా నిలిచింది.  సెమీస్‌‌లో ఓడిన హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు కాంస్య పతకాలు అందుకున్నాయి. విజేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ట్రోఫీలు అందజేశారు.