కుప్పకూలిన గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్స్.. ఇప్పుడు కొనొచ్చా..? శనివారం రిటైల్ రేట్లు తగ్గుతాయా..?

కుప్పకూలిన గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్స్.. ఇప్పుడు కొనొచ్చా..? శనివారం రిటైల్ రేట్లు తగ్గుతాయా..?

బంగారం, వెండి రేట్లు ప్రస్తుతం ప్రపంచాన్నే షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఆల్ టైం హైలకు చేరుకున్న తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ ధరలు శనివారం 24 శాతం వరకూ క్రాష్ అయ్యాయి. వాస్తవానికి ట్రంప్ కొత్తగా నియమించబోయే యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ చైర్మన్ వడ్డీ రేట్లను తగ్గిస్తారనే అంచనాలనేతో ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండి రేట్లు కుప్పకూలాయి. ఈ క్రమంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీలో ఏప్రిల్ ఎక్స్పైరీ ఉన్న గోల్డ్ ఫ్యూచర్లు 9 శాతం పడిపోగా, మార్చి ఎక్స్పైరీ ఉన్న వెండి ఫ్యూచర్స్ రేట్లు 15 శాతం శనివారం ఇంట్రాడేలో పతనాన్ని నమోదు చేసి కేజీ రేటు రూ.3లక్షల 40వేల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది సాయంత్రం 4 గంటల సమయంలో. 

ఈ క్రమంలో యాక్సిస్ సిల్వర్ ఈటీఎఫ్స్ 24 శాతం పడిపోగా, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్.. కోటక్ సిల్వర్ ఈటీఎఫ్ 23 శాతం క్రాష్ అయ్యింది. ఇక ఎస్బీఐ సిల్వర్ ఈటీఎఫ్ కూడా 22 శాతం రేటు పతనాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో గోల్డ్ ఫండ్స్ విషయానికి వస్తే.. నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ కూడా 10 శాతం తగ్గుదలను చూసింది ఇవాళ ఒక్కరోజునే. అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ కూడా 10 శాతం, యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్ 12 శాతం తగ్గాయి. మిగిలిన చాలా పేరొందిన ఫండ్స్ కూడా ఇదే తరహాలో పతనాన్ని నమోదు చేస్తున్నాయి.

ALSO READ : మేం చేస్తోండి గాడిద చాకిరీ.. బెంగళూరు క్యాబ్ డ్రైవర్ ఆవేదన.. 16 గంటలు పనిచేస్తే మిగిలేది ఎంతంటే..?

మరి ఇన్వెస్టర్లు ఏం చేయాలి.. కొనొచ్చా..?
బంగారం, వెండి ధరల్లో కనిపిస్తున్న హెచ్చుతగ్గుల కారణంగా చాలా మంది ఇన్వెస్టర్లకు వస్తున్న అనుమానం పెట్టుబడి పెట్టవచ్చా అన్నదే. ముఖ్యంగా సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, AI మౌలిక సదుపాయాల నుండి వెండికి పారిశ్రామికంగా రికార్డు స్థాయిలో డిమాండ్ ఉండటం వల్ల దీని భవిష్యత్తు ఆశాజనకంగా ఉందని ఆనంద్ రాఠి నిపుణులు చెబుతున్నారు.

అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరమని, రాబోయే కొన్ని వారాల పాటు 'సిస్టమాటిక్' పద్ధతిలో కొనుగోళ్లు చేయడం ఉత్తమమని అంటున్నారు. ఇలా చేయడం వల్ల ధరలు ఇంకా తగ్గినా నష్టపోకుండా యావరేజ్ రేటు వద్ద కొనుగోలు చేసేందుకు వీలుంటుందని అంటున్నారు. సాధారణ ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో 5-10 శాతం వరకు విలువైన గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్స్ కి కేటాయించడం మంచిదంటున్నారు.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల వద్ద పెరిగిన నిల్వలు, ద్రవ్యోల్బణ భయాలు బంగారం ధరలను ప్రేరేపిస్తున్నాయి. స్వల్పకాలికంగా మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా ఇవి మంచి లాభాలను అందిస్తాయని విటి మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి మార్కెట్ ఆవేశంతో కాకుండా క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులకు ఈ 'కరెక్షన్' సమయం ఒక వ్యూహాత్మక అవకాశమని నిపుణులు చెబుతున్నారు. స్పాట్ మార్కెట్లో రేట్ల పతనం రానున్న రోజుల్లో రిటైల్ మార్కెట్ల రేట్లలో కనిపిస్తుందని వారు చెబుతున్నారు.