డిగ్రీ, బీటెక్ అర్హతతో జూనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ జాబ్స్...జీతం రూ. లక్షా 20 వేలు

డిగ్రీ, బీటెక్ అర్హతతో జూనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ జాబ్స్...జీతం రూ. లక్షా 20 వేలు

రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (ఐఓఎల్) జూనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ (జేపీఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు ఫిక్స్​డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. 

  • మొత్తం ఖాళీలు: 77. (జూనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్).
  • విభాగాల వారీగా ఖాళీలు: కెమికల్ 01, ఎలక్ట్రికల్ 06, ఎలక్ట్రానిక్స్ 26, మెకానికల్ 37, ఆప్టిక్స్ అండ్ కోటింగ్ 07. 
  • ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీఈ/ బి.టెక్. లేదా బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.  అభ్యర్థులకు సంబంధిత రంగంలో కనీసం 5 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
  • వయోపరిమితి:18 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి.  కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
  • అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా. 
  • పూర్తిచేసిన దరఖాస్తు ఫారమ్‌ను అవసరమైన ధ్రువపత్రాలతో కలిపి వర్క్ మేనేజర్ (హెచ్ఆర్), ఇండియా ఆప్టెల్ లిమిటెడ్, ఓఎఫ్ఐఎల్ క్యాంపస్, రాయ్​పూర్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.
  • లాస్ట్ డేట్: ఏప్రిల్ 04. 
  • సెలెక్షన్ ప్రాసెస్: దరఖాస్తుల షార్ట్​లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ indiaoptel.in ను సందర్శించవచ్చు.