మేం చేస్తోండి గాడిద చాకిరీ.. బెంగళూరు క్యాబ్ డ్రైవర్ ఆవేదన.. 16 గంటలు పనిచేస్తే మిగిలేది ఎంతంటే..?

మేం చేస్తోండి గాడిద చాకిరీ.. బెంగళూరు క్యాబ్ డ్రైవర్ ఆవేదన.. 16 గంటలు పనిచేస్తే మిగిలేది ఎంతంటే..?

బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో మనం యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు, ఏసీలో కూర్చుని హాయిగా ప్రయాణిస్తాం. కానీ ఆ కారును నడిపే డ్రైవర్ జీవితం ఎంత దుర్భరంగా ఉందో తెలిపే ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకప్పుడు వ్యాపారం చేసి నష్టపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక వ్యక్తి.. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి క్యాబ్ డ్రైవర్‌గా మారాడు బెంగళూరులో. అయితే రోజులో దాదాపు 16 గంటల పాటు శ్రమించినా.. కనీస అవసరాలు తీరడం గగనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. గిగ్ ఎకానమీలో జరుగుతున్న కార్మికుల దోపిడీని ఇది ప్రతిబింబిస్తోంది.

ALSO READ : గూగుల్ ఫోటోస్ కొత్త అప్‌డేట్

ఆ డ్రైవర్ తన దైనందిన జీవితం గురించి వివరిస్తూ.. ప్రతిరోజూ ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సుమారు 16 గంటల పాటు కారు నడుపుతున్నట్లు తెలిపాడు. ఉబెర్, రాపిడో వంటి యాప్‌ల ద్వారా రోజుకు సుమారు 4వేలు రూపాయల ఆదాయం వస్తుంది. అయితే ఇందులో అద్దె కారుకు 15 వందల రూపాయలు, సీఎన్‌జీ కోసం 12 వందల రూపాయలు.. ఇక ఫుడ్ అండ్ వాటర్ కోసం 200 రూపాయలు ఖర్చవుతున్నాయని చెప్పాడు రోజుకు. అంటే 16 గంటల పాటు ట్రాఫిక్‌లో తిరిగితే.. చివరకు మిగిలేది కేవలం 11 వందల రూపాయలే మిగులుతున్నాయంట. ఇందులో మళ్లీ కారు మెయింటెనెన్స్, కుటుంబ ఖర్చులు నడిపిస్తున్నట్లు చెప్పాడు సదరు వ్యక్తి.

ALSO READ : NSE, BSEకి పోటీగా మరో స్టాక్ ఎక్స్ఛేంజీ.. 

శారీరక శ్రమ గురించి చెబుతూ.. రోజంతా కారు నడపడం వల్ల కాళ్లు, మోకాళ్లు విపరీతంగా నొప్పి పుడతాయని పేర్కొన్నాడు. రాత్రి ఇంటికి వెళ్ళాక ఎంత అలసిపోయినా కారును శుభ్రం చేసుకోవాలి. కేవలం 6 గంటల నిద్ర మాత్రమే దొరుకుతోందని రాసుకొచ్చాడు తన పోస్టులో. యాప్‌లలో వచ్చే ఆర్డర్‌లను 5-6 సెకన్లలోపు స్వీకరించకపోతే.. రేటింగ్ పడిపోతుందని, అందుకే క్షణం కూడా తీరిక లేకుండా గాడిద చాకిరీ చేయాల్సి వస్తోందని ఆవేదన చెందాడు. ప్రజలు పొందుతున్న సౌకర్యాల వెనుక వేలాది మంది చౌక కార్మికుల కష్టం ఉందని ఇది నిరూపిస్తోంది. ఇక్కడ దోపిడీ చేసేవాడు లేదా దోపిడీకి గురయ్యేవాడు మాత్రమే ఉంటారని సదరు గిగ్ వర్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి.

ALSO READ : 15 నిమిషాల్లో రూ.4 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఆవిరి..

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు యూజర్లు. డ్రైవర్ పడుతున్న శారీరక, మానసిక వేదనను చూసి చాలామంది సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు కారు అద్దె విషయంలో చర్చిస్తూ, రోజుకు 15 వందల రూపాయల అద్దె చాలా ఎక్కువని, అది డ్రైవర్‌ను మరింత కృంగదీస్తోందని అంటున్నారు. మన చుట్టూ ఉన్న గిగ్ వర్కర్ల పట్ల గౌరవంగా.. దయతో ఉండాలని, వారి కష్టాన్ని తక్కువ చేసి చూడవద్దని నెటిజన్లు కోరుతున్నారు.