గూగుల్ ఫోటోస్ కొత్త అప్‌డేట్: ఇక మాటలతోనే ఫోటో ఎడిటింగ్!

గూగుల్ ఫోటోస్ కొత్త అప్‌డేట్: ఇక మాటలతోనే ఫోటో ఎడిటింగ్!

టెక్ దిగ్గజం గూగుల్  భారతీయుల కోసం ఒక కొత్త అదిరిపోయే ఫీచర్‌ లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా గూగుల్ ఫోటోస్‌ చాలా ఈజీగా ఎడిటింగ్  చేసుకోవచ్చు. కొత్త ఫీచర్ ద్వారా  మీరు ఏదైనా ఫోటోని ఎడిట్ చేయాలనుకుంటే ఇకపై స్లైడర్లు లేదా టూల్స్‌ అవసరం లేదు. వాయిస్  లేదా టెక్స్ట్  ద్వారా గూగుల్‌కు చెబితే చాలు, అదే ఎడిట్ చేసి ఇస్తుంది.

ఎలా వాడాలంటే : మొదట ఏదైనా ఫోటో ఓపెన్ చేసి "Help me edit" అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఫోటోలో మీకు కావాల్సిన లేదా చేయాల్సిన మార్పులు చెబితే చాలు, దాని ఆధారంగా ఫోటోలో మార్పులు చేసి పెడుతుంది. ఫోటో బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేయడం, లైటింగ్ లేదా బ్రైట్ నెస్ పెంచడం వంటివి వాయిస్ ద్వారా ప్రాంప్ట్ ఇస్తే చాలు.  సెకన్లలో ఎడిట్ చేసి ఇస్తుంది. 

ఈ ఫీచర్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం, మరాఠీ, బెంగాలీ సహా గుజరాతీ భాషల్లో  సపోర్ట్  చేస్తుంది. ఇందుకు కనీసం 4GB RAM, ఆండ్రాయిడ్ 8.0 లేదా అంతేకంటే ఎక్కువ వెర్షన్ ఉన్న ఫోన్లలో పనిచేస్తుంది. AI ద్వారా ఎడిట్ చేసిన ఫోటోల విషయంలో ఎటువంటి మోసాలు జరగకుండా గూగుల్ C2PA అనే టెక్నాలజీని వాడుతోంది. దీనివల్ల ఆ ఫోటో ఎప్పుడు, ఎలా ఎడిట్ అయ్యిందనే 'డిజిటల్ లేబుల్' ఆ ఫోటోకు ఉంటుంది.