- ప్రభుత్వ విప్, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు: ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచి క్లీన్ స్వీప్ చేయబోతున్నామని ప్రభుత్వ విప్, డీసీసీ చీఫ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు. శుక్రవారం యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీ వార్డు అభ్యర్థులతో కలిసి నిర్వహించిన నామినేషన్ ర్యాలీలో స్టేట్ విమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణితో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేస్తున్నామని, పొత్తులో భాగంగా కాంగ్రెస్ 11 వార్డుల్లో, సీపీఐ ఒక వార్డులో పోటీ చేస్తున్నామని ప్రకటించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని చెప్పారు. ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్ పోటీలో ఉన్న వార్డుల్లో బీజేపీ.. బీజేపీ పోటీ చేస్తున్న వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను పెట్టలేదన్నారు. మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు భిక్షపతి, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి గుండ్లపల్లి వాణీ భరత్ గౌడ్, వైస్ చైర్మన్ అభ్యర్థి ముక్కెర్ల మల్లేష్ యాదవ్, వార్డు అభ్యర్థులు పాల్గొన్నారు.
